‘పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మాత్రమే ముఖ్యం కాదు …అదే ప్రజాస్వామ్యం’ అని అమెరికన్ జర్నలిస్ట్ వాల్టర్ క్రోంకైట్ అన్నారు. భారతదేశ జాతీయ పత్రికా దినోత్సవం ప్రతి ఏడాది నవంబర్ 16న జరుపుకుంటాం. ఈ సందర్భంగా, లెక్కలేనంత మంది జర్నలిస్టులు ఉగ్రవాద నిరోధక చట్టాల అభియోగాలపై జైళ్లలో మగ్గుతున్నారనే విషయం మరువలేం. ఇలా పరిస్థితి ఉండటం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించటమే అని సుప్రీమ్ కోర్టు చెబుతుండగా కూడా చాలా మంది జర్నలిస్టులను జైళ్లలో మగ్గుతున్నారు. వీరికి వారి న్యాయవాదులను కలవడానికి అనుమతి లేదు. కనీసం కుటుంబ సభ్యులు కలవటానికి అనుమతి లేదు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ప్రెస్ కమ్యూనిటీ అందించే వార్తా కథ•నాల నాణ్యతపై నిఘా ఉంచే ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది. పాత్రికేయ రంగంలో ఆబ్జెక్టివిటీ దేశంలో రాజకీయ కారకాలతో రాజీ పడకుండా లేదా ప్రభావితం కాకుండా చూడటానికి ఏర్పాటయిన ‘‘నైతిక’’ వాచ్డాగ్గా పనిచేస్తుంది. ఈ సంస్థ జర్నలిస్టుల పరిస్థితిపై కిక్కురు మనటం లేదు.
ప్రజాస్వామ్యంలో ధై•ర్యం నిండిన నాల్గవ స్తంబాన్ని ప్రెస్ అని దేశం గుర్తించినప్పటికీ నేడు చాలా మంది జర్నలిస్టుల భవిష్యత్తు న్యాయవ్యవస్థపైనా, జర్నలిస్టుల విమర్శనాత్మక కవరేజీని ఆమోదించని ప్రభుత్వం దయ మీద ఆధారపడి ఉన్నాయి. దేశంలో కొరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ మరింత దిగజారింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ముందుకు వొచ్చిన విలేఖరులను, మీడియా సంస్థలను అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో 180 దేశాలలో భారతదేశం 142 స్థానంలో ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే రెండు స్థానాలు కిందికి భారత్ పడిపోయింది. మార్చి 15 నుంచి మే 31 మధ్య భారతదేశంలో కొరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవటంలో ప్రభుత్వం ఎలా విఫలం అయినది తెలిపే రిపోర్టస్ రాసిన 55 మంది జర్నలిస్టులను ప్రభుతం లక్ష్యంగా చేసుకున్నట్లు ఏ రైట్స్ అండ్ రిస్కస్ ఎనాలిసిస్ గ్రూప్ 2020 జూన్ 15 న విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అరెస్టు, ఎఫ్ఐఆర్ నమోదు, సమన్లు లేదా షో-కాజ్ నోటీసులు, శారీరక దాడులు, ఆస్తులను నాశనం చేస్తూ బెదిరింపులను జర్నలిస్టులు ఎదుర్కొన్నారని నివేదిక తెలిపింది.
సోమవారం రోజు జాతీయ పత్రిక స్వేచ్ఛ దినం అని రాజకీయ నాయకులూ ట్వీట్స్ చేసి ట్విట్టర్ నింపేశారు. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛను నిలబెట్టడానికి కట్టుబడి ఉన్నామని ఊదరగొట్టారు.
డొల్ల మాటలు అలా ఉండగా వాస్తవిక పరిస్థితి ఇలా వుంది. సిద్దిక్ కప్పన్, ప్రశాంత్ కనోజియా, ఆసిఫ్ సుల్తాన్, ప్యాట్రిసియా ముఖిమ్, అహాన్ పెంకర్ సహా పలువురు జర్నలిస్టులను తమ విధిని నిర్వర్తించినందుకు ఉగ్రవాద నిరోధక చట్టాల కింద అభియోగాలు మోస్తూ జైళ్లలో మగ్గుతున్నారు. పత్రికా స్వేచ్ఛపై మరో దాడి ఏమంటే జమ్మూ కాశ్మీర్ ఎస్టేట్స్ విభాగం అక్టోబర్ 19 న ప్రెస్ ఎన్క్లేవ్ లోని ప్రభుత్వ భవనంలో కాశ్మీర్ టైమ్స్ కార్యాలయాన్ని ప్రభుత్వం మూసివేసింది. జమ్మూ కాశ్మీర్లోని పురాతన ఆంగ్ల దినపత్రికల యజమానులు కనీసం ముందస్తు నోటీసు కూడా ఇవ్వలేదని వాపోతున్నారు. సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా, గుజరాతీ న్యూస్ పోర్టల్, ఫేస్ ఆఫ్ నేషన్ సంపాదకుడు యజమాని ధవల్ పటేల్, భూమ్కల్ సమాచార్ సంపాదకుడు కమల్ శుక్లాపై దేశద్రోహ కేసులను నమోదు అయివున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర మంత్రులు ట్విట్టర్ నిండా ..పత్రికా స్వతంత్రం కాపాడతామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో కేవలం మేల్కొన్న ప్రజలు మాత్రమే పత్రికా స్వాతంత్య్రాన్ని కాపాడగలరు.