Take a fresh look at your lifestyle.

నగర ప్రజలకు డిసెంబర్‌ ‌నుంచి.. ఉచితంగా మంచినీటి సరఫరా

  • సెలూన్లకు ఉచిత విద్యుత్‌ ‌సరఫరా
  • సిఎం కెసిఆర్‌ ‌వరాల జల్లు
  • తెలంగాణ భవన్‌లో పార్టీ మ్యనిఫెస్టో విడుదల

గ్రేటర్‌ ఎన్నికల దృష్ట్యా సిఎం కెసిఆర్‌ ‌జంట నగరాల ప్రజలపై వరాల జల్లు కురిపించారు. సాధారణ ప్రజల పట్ల కరుణ చూపారు. వివిధ వర్గాలకు తాయిలాలు ప్రకటిస్తూ పార్టీ ప్రణాళికను విడుదల చేశారు. గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో నగర ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్దికి వోటేయాలన్నారు. నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పామని, దానిని కాపడుకుందామని పిలుపునిచ్చారు. ఇకపోతే హావి•లో భాగంగా 20 వేల లీటర్ల లోపు మంచినీటిని వాడుకునే వారికి డిసెంబర్‌ ‌నెల నుంచి ఉచితంగా తాగునీరు అందించనున్నట్లు ప్రకటించారు. వినియోగదారులు ఒక్క రూపాయి కూడా ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతివారు నివసించే ఈ నగరంలో ప్రజల వి•ద కొంత భారాన్ని తీసేయాలని యోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కెసిఆర్‌ ‌తెలిపారు. ఆయన ఇచ్చిన హావి•లలో ముఖ్యంగా డిసెంబర్‌ ‌నుంచి నీటి బిల్లు కట్టాల్సిన పని లేదని, ఉచితంగా తాగునీరు సరఫరా చేస్తామని ప్రకటించారు. అలాగే 24 గంటలు నీటి సరఫరా చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్‌లకు ఉచిత విద్యుత్‌ ‌కూడా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమలు, షాపులు, ఆరు నెలల మినిమం విద్యుత్‌ ‌బిల్లులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక 40 వేల సినిమా కార్మికులకు రేషన్‌ ‌కార్డు ఇస్తున్నామని ఆయన ప్రకటించారు. అలాగే థియేటర్స్ ‌విద్యుత్‌  ‌చార్జీలు ప్రారంభం అయ్యే దాకా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భారతదేశంలోనే ఒక నిజమైన కాస్మోపాలిటన్‌ ‌నగరంగా గొప్ప చారిత్రకనగరంగా హైదరాబాద్‌ ‌ప్రసిద్ధిగాంచిందన్నారు. ఈ నగరానికి చరిత్ర, సంస్క్యృతిగల నగరం ఎవరు ఇక్కడి నుంచి వొచ్చినా అక్కున చేర్చుకుందన్నారు.

Leave a Reply