Take a fresh look at your lifestyle.

బీహార్ లో ఉచితంగా కొరోనా వ్యాక్సిన్ బిజెపి  హామీ సిగ్గుచేటు ..!

* బిజేపి ఒక బీహార్ రాష్ట్రానికేనా…  దేశానికి ప్రభుత్వమా…?
*విరుచుకుపడ్డ మంత్రి హరీష్ రావు.. బిజెపి నుండి టి ఆర్ఎస్ పార్టీ లో  చేరిన  పలువురు నాయకులు
బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కొరోనా కు వాక్సిన్  ఉచితంగా పంపిణీ చేస్తామని అనడం సిగ్గుచేటు అన్నారు.  బీహార్  లో ఉచితంగా కొరోనా మందును పంపిణీ చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… బీజేపీ గెలిస్తే బాయికాడ మీటర్లు, కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కష్టాలు మొదలవుతాయని అన్నారు. ముంపు ప్రభావిత గ్రామాల్లో సైతం టిఆర్ఎస్ కు  ఏకగ్రీవంగా మద్దతు పలుకుతున్నాయనారు.తేలుకుట్టిన దొంగల్లా బిజెపి నాయకులు వ్యవహరిస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.   దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆశయసాధనకు అభ్యర్థి సుజాత ఆశీర్వదించి కారు గుర్తుకు వోటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందన్నారు . సంక్షేమ పథకాలు, ప్రజా అభివృద్ధి పథకాలు అమలు చేయడంలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నారు. దివంగత మాజీ మంత్రి ముత్యం రెడ్డి హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకపోవడంతో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను బదులుగా అదనపు ట్రాన్స్ఫార్మర్ మంజూరుకు మరో 30 వేల రూపాయలు చెల్లించడంతో రైతులపై భారం పడేదనీ  గుర్తు చేశారు . దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో తాను భాగస్వామినై సిద్ధిపేట తరహాలో కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎంపీపీ సాయిలు, డిసిసిబి డైరెక్టర్ వెంకటయ్య,  వైస్ ఎంపీపీ రాజులు, ఎంపీటీసీ సభ్యులు నర్సింలు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు , ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply