Take a fresh look at your lifestyle.

ఆయుష్మాన్‌ ‌భారత్‌తో 5 లక్షల వరకు ఉచిత వైద్యం

కోవిడ్‌ ‌సంక్షోభంలో హైదరాబాద్‌ ఈఎస్‌ఐసి సేవలు ప్రశంసనీయం
హాస్పిటల్‌లో నాలుగు సేవలు ప్రారంభించిన కిషన్‌ ‌రెడ్డి

కోవిడ్‌ ‌సంక్షోభ సమయంలో ఈఎస్‌ఐసి, హైదరాబాద్‌ అం‌దించిన సేవలు ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  కిషన్‌ ‌రెడ్డి అన్నారు. శనివారం ఈఎస్‌ఐసి హైదరాబాద్‌లో నాలుగు సరికొత్త వైద్య సేవలు, సదుపాయాలను కిషన్‌ ‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ నవ భారత నిర్మాణంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అనేక ఆరోగ్య సంరక్షణ పథకాలకు రూపకల్పన చేసి, సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. ఐదు లక్షల ఆరోగ్య బీమా సదుపాయం గల ఆయుష్మాన్‌ ‌భారత్‌ ఒక గొప్ప పథకం అని అన్నారు. దీని ద్వారా దేశంలో ఎక్కడయినా కార్పొరేట్‌ ‌వైద్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు.
మార్కెట్‌ ‌ధర కంటే, 50 నుండి 90 శాతం  తక్కువ ఖర్చుతో ఔషధాలను అంధించే జన ఔషధీ కేంద్రాల వ్యవస్థ, నేషనల్‌ ‌డిజిటల్‌ ‌హెల్త్ ‌మిషన్‌, ‌మిషన్‌ ఇం‌ధ్ర ధనుష్‌ ‌మొదలైన పథకాలు ప్రజలకు గొప్ప వరమని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్‌ ‌సంక్షోభ సమయంలో ఈఎస్‌ఐ ‌హైదరాబాద్‌ ‌సేవలు చాలా ప్రశంసనీయమని, డీన్‌ శ్రీ‌నివాస్‌ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం అహర్నిశలు కృషి చేసి సరికొత్త ఆవిష్కరణలతో సరైన సమయంలో రోగులకు వైద్య సేవలను అందించారని  కిషన్‌ ‌రెడ్డి అన్నారు.

 

Leave a Reply