Take a fresh look at your lifestyle.

త్వరలో పోలీస్‌ ‌శాఖలో ఎస్‌ఐ, ‌కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ

సిద్ధిపేటలో జిల్లాలో ఉచిత శిక్షణా కేంద్రాలు: సిపి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో పోలీస్‌ ‌శాఖలో  భారీ ఎత్తున పోలీస్‌ ‌కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాలకు ప్రకటన రానున్న సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని యువతీ,యువకులు,నిరుద్యోగులు పోలీస్‌ ‌శాఖలో ఉద్యోగం కైవసం చేసుకోవడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు నేతృత్వంలో జిల్లా కలెక్టర్‌ ‌పి. వెంకట్రామ రెడ్డి, సిద్దిపేట పోలీస్‌ ‌కమిషనర్‌ ‌డి.జోయల్‌ ‌డేవిస్‌  ‌సిద్దిపేట జిల్లాలో పోలీస్‌ ‌కానిస్టేబుల్‌ ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలతని నిర్ణయించినట్లు సిపి జోయల్‌ ‌డేవిస్‌ ‌తెలిపారు.

ఇందుకు గానూ అర్హులైన ఇంటర్మీడియట్‌, ‌తత్సమానమైన తరగతిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 11నుంచి 17వరకు సిద్దిపేట జిల్లాలోని మీ మీ పరిధిలో గల పోలీస్‌ ‌స్టేషన్‌ ‌నందు ఎస్‌ఎస్‌సి మెమో, ఇంటర్మీడియట్‌ ‌మెమో, ఆధార్‌ ‌కార్డు, రేషన్‌ ‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు• జిరాక్స్, ‌రెండు పాస్‌ ‌పోర్ట్ ‌సైజు ఫోటోలు ఇచ్చి మీ పేరు, పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలనీ,  శిక్షణ కేంద్రాల్లో రాత పరీక్షతోపాటు శారీరక దృఢత్వ శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు సిపి తెలిపారు.

Leave a Reply