- 80కోట్ల మందికి లబ్ది చేకూరేలా గరీబ్ కల్యాణ్ అన్న యోజన
- కొరోనా కట్టడిలో మరింత కఠినంగా ఉండాల్సిందే
- నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోక తప్పదు
- లాక్డౌన్ ఉన్నట్లుగానే ఉండాల్సిందే
- దేశంలో కొరోనా కేసులు పెరగడంపై ఆందోళన
- జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
లాక్డౌన్లో ఉన్నట్లుగానే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా నుంచిరక్షణకు ఇంతకు మించి చేసేదే లేదని ప్రధాని మోడీ ప్రజలకు సూచించారు. మనమెంత కఠినంగా ఉంటే అంతగా కరోనా నుంచి దూరంగా ఉండగలమన్నారు. నిర్లక్ష్యంగా ఉండడం తగదని హెచ్చరించారు. కరోనా నుంచి ప్రజలను రక్షించుకునే క్రమంలో ప్రధాని గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రానున్నది పండగల సీజన్ కావడంతో ఈ నిర్ణయం పేదలకు అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. నవంబర్ చివరి వరకు ఉచిత రేషన్ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. జూలై నుంచి నవంబర్ వరకు 80 కోట్ల మందికి రేషన్ ఇస్తామని తెలిపారు. నెలకు 5 కిలోల బియ్యంతోపాటుగా, కిలో పప్పు అందజేస్తామని తెలిపారు. మంగళవారం ప్రధాని మోదీ మరోమారు జాతినుద్దేశించి ప్రసంగించారు. వాతావరణంలో సీజనల్ మార్పు కారణంగా వర్షాకాలంలో ప్రవేశించామని, ఈ దశలో ప్రజలంతా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా పోరాటంలో భారత్ ముందుందని తెలిపారు. కరోనాతో చనిపోతున్నవారి సంఖ్యను చూస్తే.. ప్రపంచంలో భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. సరైన సమయంలో లాక్డౌన్ పెట్టడం వల్ల కరోనా అదుపులో ఉందన్నారు.
కానీ అన్‌లాక్ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి కేసులు మళ్లీ పెరుగుతు న్నాయి. కొద్దిరోజుల నుంచి మాస్కులు వేసుకోవడంలో ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. లాక్డౌన్ సమయంలో నిబంధనలను చాలా కఠినంగా పాటించారు. మళ్లీ ఒకసారి రాష్ట్రప్రభుత్వాలు నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక దేశ ప్రధాని మాస్కు పెట్టుకోలేదని రూ.13వేలు జరిమానా విధించారు. మన ప్రభుత్వాలు కూడా ఇదే స్ఫూర్తితో కఠినంగా వ్యవహరించాలి. సామాన్యుల నుంచి ప్రధాని వరకు ఎవరూ నిబంధనల కంటే ఎక్కువ కాదు. లాక్డౌన్ సందర్భంగా ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ప్రభుత్వాలు పనిచేశాయని తెలిపారు. దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య పథకాల్లో ఒకటైన గరీబ్ కల్యాణ్ యోజనను నవంబరు నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. రూ. 90 వేల కోట్ల వ్యయంతో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు వెల్లడించారు. కుటుంబంలోని ప్రతిఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం, నెలకు కిలో చొప్పున కందిపప్పును ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు. గడిచిన 3 నెలల్లో 20 కోట్ల పేద ప్రజల కుటుంబాలకు రూ. 31 వేల కోట్లను డిపాజిట్ చేశామన్నారు.
అదేవిధంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లను జమచేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. కరోనాపై పోరాటం చేస్తూ చేస్తూ అన్‌లాక్-2 దశలోకి ప్రవేశించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల జలుబు, జ్వరం వచ్చే మాసంలోకి కూడా ఎంటర్ అయ్యామన్నారు. ఇలాంటి సందర్భంలో దేశ ప్రజలకు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా మృతుల నివారణలో భారత్ మెరుగ్గా ఉందన్నారు. లాక్డౌన్ సరైన సమయంలో చేపట్టడం, ఇతర నిర్ణయాల వల్ల లక్షలాది మంది భారతీయుల ప్రాణాలను రక్షించుకోగలిగామన్నారు. అన్‌లాక్-1 దశ నుంచి కొంత మార్పులు చోటుచేసుకున్నట్లు చెప్పారు. జనం నిర్లిప్తంగా ఉంటున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎక్కవ జాగ్రత్త పడాల్సిన దశలో.. జనం పట్టింపులేనట్లుగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. లాక్డౌన్ వేళ నియమాలను కఠినంగా పాటించామన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు, ప్రజలు.. అలాంటి తరహా నియమాలు పాటించాలన్నారు. విశేషంగా కంటేయిన్మెంట్ జోన్లపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలన్నారు. ఎవరు నియమావళిని ఉల్లంఘిస్తున్నారో.. వారిని అడ్డుకోవాలన్నారు. వారికి ఆ పద్ధతులను నేర్పించాలన్నారు. ఓ దేశ ప్రధానిపై రూ.13000 జరిమానా ఎందుకు వేశారో.. రు చూసి ఉంటారని, ఆయన మాస్క్ ధరించకపోవడం వల్ల ఆ ్గ•న్ వేశారన్నారు. భారత్‌లోనూ కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. భారత ప్రధాని అయినా, ప్రజలైనా .. నియమావళిని ఎవరూ ఉల్లంఘించకూడదన్నారు.జాతిని ఉద్దేశించి మాట్లాడటానికి పూర్వం ఇవాళ ఉదయం ప్రధాని మోదీ .. కోవిడ్19 వ్యాక్సిన్‌పై ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ సమయంలో మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ఇది ఆరవసారి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మే 12వ తేదీన ఆయన చివరిసారి 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.