Take a fresh look at your lifestyle.

80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్‌..దీపావళి వరకు..! ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

కొరోనా ఆపత్కాలంలో పేదలను ఆదుకునేందుకు దీపావళి వరకు పీఎం గరీభ్‌ ‌కళ్యాణ్‌ అన్నదాన యోజన పథకం కొనసాగు తుందని, పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని అన్నారు. ఎవరూ ఆకలితో బాధపడొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని దీపావళి వరకూ పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకం వల్ల 80 కోట్ల మంది పేదలు ఉచిత రేషన్‌ అం‌దుకుంటారని ప్రధాని పేర్కొన్నారు. గత ఏడాది కూడా కోవిడ్‌ ‌సమయంలో కొన్ని నెలల పాటు ఈ స్కీమ్‌ను కేంద్రం అమలు చేసింది.

 

ఆం‌ధ్ర సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత. ఆంధ్రప్రదేశ్‌ ‌సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శి. తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన సాహితీకారుడు, ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు దేవులపల్లి రామానుజరావు. తెలంగాణలో శోభ, గోల్కొండ పత్రికలకు సంపాదకుడిగా, సురవరం ప్రతాపరెడ్డి తర్వాత అంతటి సాహిత్య సేవ చేసిన సాహితీకారుడు. చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు. ఇంగ్లిషు, తెలుగు, ఉర్దూ భాషా ప్రవీణుడు, వక్త, పరిశోధకుడు. తెలుగు సంస్కృతి అంటే మంచి అభిమాని.

Leave a Reply