మండ లంలో ని పర్ణశాల మరియు దుమ్ము గూడెం ప్రాదమిక ఆరోగ్య కేంద్రాల పరిదిలో ని మారుమూల గిరిజన గ్రామాలైన పులిగుండాల, ముల కనాపల్లి, కొండివాయి తో పాటు కొత్తపల్లి గ్రామ పంచాయి తీలో బుదవారం సంచార కరోనా యాంటి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిం చినట్లు వైద్యులు మణదీప్, బాలాజీ నాయక్ తెలిపారు. పర్ణశాల పిహెచ్సి ఆద్వర్యంలో మొత్తం 140 మందికి పరీక్షలు నిర్వహించగా ములకనాపల్లికి చెందిన •క వ్యక్తికి మాత్రమే పాజిటినమోదు కాగా దుమ్ముగూడెం పిహెచ్సి ఆద్వ ర్యంలో 183 మందికి కరోనా పరీ క్షలు నిర్వహించగా ఎనిమిది పాజి టివ్ కేసులు నమోదు కాగా వీటిలో పర్ణశాల •కరికి, కొత్తపల్లి గ్రామానికి చెందిన ఏడుగరికి పాజిటివ్ తేలింది. నర్సాపురం వైద్యశాలలో మొత్తం 36 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురుకి పాజిటివ్ తేలినట్లు వైద్యాధికారి చైతన్య తెలిపారు. పాజిటివ్ నమోదు అయిన నలుగురు వ్యక్తులు భద్రాచలం పట్టణానికి చెందిన వారుగా ఆయన తెలిపారు.
సింగవరంలో ఉచిత వైద్య శిభిరం: దుమ్ముగూడెం పిహెచ్సి పరిదిలో సింగవరం గ్రామంలో బుదవారం ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. ఈ వైద్య శిభిరంలో వైద్యాధికారి బాలాజీ నాయక్, సంచార వైద్యాధికారి రేణుకా రెడ్డిలు గర్భీణీలకు, బాలింతలకు పరీక్షలు నిర్వహించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రతి గర్భీణీ ఆసుపత్రిలో డెలివరీ చేయించు కోవడం వలన సుఖ ప్రసవం జరుగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ సెంటర్ ఏఎన్ఎమ్ గంగమ్మ వైద్య సిబ్బంది ఉన్నారు.