Take a fresh look at your lifestyle.

రాత్రి పూట అన్నార్తులకు ఉచిత భోజనం : కమిషనర్‌

అక్షయ పాత్ర అన్నపూర్ణ కేంద్రం ద్వారా అవసరమైన వారికి రాత్రిపూట కూడ భోజన సదుపాయం కల్పించాలని బల్దియా కమిషనర్‌ ‌పమేలా సత్పతి ఆదేశించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబంధిత అధికారులు, అక్షయ పాత్ర నిర్వాహకులతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మొత్తం బల్దియా పరిధిలో నిర్వహిస్తున్న 9 అన్నపూర్ణ కేంద్రాలలో అసలు భోజనం కల్పిస్తున్నామని, వీటికి అదనంగా ఎంజీఎం ఆసుపత్రి వద్ద ప్రత్యేకంగా ఒక అన్నపూర్ణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్నార్తులు అర్చకులు, దినసరి కూలీలు వలస కూలీలు, మొదలగు అవసరమైన వారికి రాత్రి పూట భోజనం ఏర్పాటు చేయాలన్నారు.

సాయంత్రం ఆరున్నర గంటల నుండి 8.30 గంటల వరకు ఉచితంగా భోజనం కల్పించాలన్నారు. నిర్వహణకు సహాయకులుగా సిబ్బంది ఇద్దరిని కేటాయిస్తూన్నట్లు తెలిపారు. సమావేశంలో బల్దియా ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ ‌రాజిరెడ్డి, పాత్ర నిర్వాహకులు రాజేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply