Take a fresh look at your lifestyle.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత (ఫోర్ వీలర్) డ్రైవింగ్ శిక్షణ

Free (four wheeler) driving training for women under the Police Department

  • జోగులాంబ జిల్లా ఇంచార్జి ఎస్పీ కె. అపూర్వ రావు, ఐపిఎస్

జిల్లాలోని మహిళలకు ఫోర్ వీలర్ వాహనాల డ్రైవింగ్ నేర్పించడం ద్వారా స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్ద్యేశం తో అలాగే మహిళలు ఇతరుల పై ఆధారపడకుండా ఫోర్ వీలర్ వాహనాలను స్వతహాగా నడిపేందుకు అవకాశం కల్పిస్తూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తేది:24.02.2020 సోమవారం నుండి ఉచిత (ఫోర్ వీలర్) డ్రైవింగ్ శిక్షణ ను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఇంచార్జి ఎస్పీ కె. అపూర్వ రావు తెలిపారు. అందులో భాగంగా జిల్లా లోని హర్హత పొందిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు గల గద్వాల్ పట్టణం, శాంతినగర్ మరియు అలంపూర్ X రోడ్ నందు ఉన్న డ్రైవింగ్ స్కూల్స్ శిక్షణ కేంద్రాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు.

ట్రాక్టర్లు, కార్లు, ఆటో లు మొదలగు ఫోర్ వీలర్ వాహనాల డ్రైవింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి గల మహిళలు ఈ రోజు, రేపు అనగా 23.02.2020 (ఆదివారం) రెండు రోజులలో గద్వాల్ పట్టణం, శాంతినగర్, ఉండవెళ్లి పోలీస్ స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు.మహిళలు డ్రైవింగ్ శిక్షణను పూర్తి చేసుకున్న అనంతరం ఉచితంగా ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ లు కూడా అందించడం జరుగుతుందని అన్నారు.
కావున జిల్లాలోని ఆసక్తి గల మహిళలు గద్వాల్, శాంతినగర్, అలంపూర్ X రోడ్ పట్టణాలలో వారికి అనుకూలమైన దగ్గరలో ఉన్నటువంటి పట్టణాన్ని ఎంపిక చేసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్ లో తమ పేర్లను నమోదు చేయించుకొని పోలీస్ శాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy