Take a fresh look at your lifestyle.

రజకులు, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌ ‌స్కీమ్‌ ‌వరం

  • అర్హులందరూ సద్వినియోగం చేసుకోనేలా ప్రత్యేక డ్రైవ్‌ ‌చేపట్టండి
  • బిసి సంక్షేమ శాఖ అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం
  • అర్హులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన

రజకుల లాండ్రీ షాపులు, దోబీఘాట్‌లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్తును అందించే స్కీమ్‌ ‌వరం లాంటిదనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. మంగళవారం సిద్ధిపేట కలెక్టరేట్‌ ‌మీటింగ్‌ ‌హాల్‌లో నాయిబ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్‌ ‌పథకంపై జిల్లా కలెక్టర్‌, ‌బిసి సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి హరీష్‌ ‌రావు సమీక్షించారు. సెలూన్‌లకు ఉచిత విద్యుత్‌ ‌కోసం నాయి బ్రాహ్మణులు 547 దరఖాస్తులు, దోబీ ఘాట్‌, ‌లాండ్రీలకు ఉచిత విద్యుత్‌ ‌కోసం రజకులు 280 దరఖాస్తులు ఇప్పటి వరకు సమర్పించారనీ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సరోజ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇంకా దరఖాస్తుల సమర్పణకు తుది గడువును ప్రభుత్వం నిర్ధారించలేదని ఆమె తెలిపారు. జిల్లాలోని రజక, నాయీబ్రాహ్మణ కమ్యూనిటీలలోని అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చైతన్యం చేస్తున్నామని ఆమె మంత్రికి తెలిపారు. వొచ్చిన దరఖాస్తుదారుల వివరాలు పేర్కొంటూ జిల్లా కలెక్టర్‌ ‌ద్వారా ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈకి లేఖ రాయాలని మంత్రి ఆదేశించారు.

నాయీబ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే చెల్లించనున్నందున వారికి కరెంట్‌ ‌కట్‌ ‌చేయవద్దని లేఖలో స్పష్టం చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ…నాయీబ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌• అం‌దించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నాయీబ్రాహ్మణులు, రజకుల సౌకర్యార్థం మున్సిపల్‌ ‌లైసెన్స్, ‌ట్రేడ్‌ ‌లైసెన్స్ ‌నిబంధనను మినహాయించిందన్నారు. షాప్‌తో పాటు ఇంటి వద్ద పని చేసే రజకులు, నాయీబ్రాహ్మణులకు కూడా ఈ స్కీం వర్తింప చేసిందన్నారు. రజకుల లాండ్రీ షాపులు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్‌ను అందించే స్కీమ్‌ ‌కింద లబ్ధిదారుల సంఖ్యను పెంచడానికి స్థానిక ప్రజాప్రతినిధులు సహకారంతో జిల్లాలో బిసి సంక్షేమ శాఖ అధికారులు స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌చేపట్టాలని మంత్రి సూచించారు.

గ్రామ వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, ఎంపిపిలు, మునిసిపల్‌ ‌వార్డు సభ్యులు, ఛైర్మన్లు తమ గ్రామాలు పట్టణాల్లో లబ్ధిదారులను గుర్తించి వారంతా సద్వినియోగంచేసుకునేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు.తర తరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న తెలంగాణలోని లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరనుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ ఉచిత విద్యుత్‌ ‌నిర్ణయం ద్వారా వృత్తి దారులకు శారీరక శ్రమ తగ్గి, ఆర్ధిక వెసులు బాటు కూడా కలగనుందన్నారు. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని లబ్ధిదారులు తమ వివరాలను మీసేవా కేంద్రాల్లో వెంటనే నమోదు చేసుకోవాలనీ మంత్రి హరీష్‌రావు పిలుపు నిచ్చారు.

Leave a Reply