Take a fresh look at your lifestyle.

‌ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు

తన తపన అంతా అప్పుడూ ఇప్పుడూ ప్రజలకోసమే
నాలుగేళ్ల సందర్భంగా ట్వీట్‌ ‌చేసిన సిఎం జగన్‌

అమరావతి,నవంబర్‌ 6 : ‌దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనం సృష్టించిన చరిత్రాత్మక ’ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ ‌చేశారు. ‘ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే.  అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోందని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వైఎస్‌ ‌జగన్‌   ‌ప్రతిపక్ష నేత హోదాలో చేసిన ’ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి శనివారంతో సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో దేశ రాజకీయాల్లోనే ఈ యాత్ర ఓ సంచలనం.. చరిత్రాత్మకం. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకు రావాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ ‌జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్‌ 6‌న వేసిన తొలి అడుగు.. వందలు, వేలు, లక్షలు, కోట్లాది మంది జనం మధ్య వారి హృదయాలను స్ప•శిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల దుగా 341 రోజుల పాటు 3,648 కిలోటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్‌ ‌జగన్‌ ‌ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను కలుసుకోని వర్గం అంటూ లేదు. అన్ని జిల్లాల్లో జనం ’జయహో జగన్‌’ అం‌టూ తరలి వచ్చి తమగోడును వెళ్లబోసుకున్నారు. మరో వైపు పూలబాట వేసి అపూర్వ స్వాగతం పలికారు. నుదుట కుంకుమ దిద్దారు. నిరుపేద మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, అనాధలు, అర్హతలున్నా ఉద్యోగం.. ఉపాధి లేని యువత, విద్యార్థులు, అన్నమో రామచంద్రా అంటూ రైతులు పాదయాత్రలో భాగస్వాములయ్యారు. ఎక్కడికక్కడ వారి బాధలు చెప్పుకున్నారు.

Leave a Reply