Take a fresh look at your lifestyle.

నిజామాబాద్‌లో కొరోనాతో ఒకేసారి నలుగురు మృతి

ఆక్సిజన్‌ అం‌దక మృతి చెందాడంటూ బంధువుల ఆందోళన
‌కొరోనాతో ఒకేసారి నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌ ‌జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో కలకలం సృష్టిస్తోంది. ఒకరు ఆక్సిజన్‌ అం‌దక మృతిచెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో ముగ్గురు కొరోనా కారణంగానే చనిపోయారని అంటున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అతడు చనిపోయారని మృతుడి కుటుంబ సభ్యులు హాస్పిటల్‌ ‌ముందు ఆందోళన చేపట్టారు. నిజామాబాద్‌ ‌జిల్లాలో ఇప్పటివరకు కరోనా కారణంగా 9 మంది మృతి చెందారు.

అయితే ఒకేసారి నలుగురు చనిపోవడంతో హాస్పిటల్‌ ‌సిబ్బంది నిర్లక్ష్యంపై పలు అనుమానులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా హాస్పిటల్‌ని కలెక్టర్‌ ‌నారాయణ రెడ్డి సందర్శించారు. నలుగురు కొరోనా బాధితులు ఒకేసారి ఎలా చనిపోయారన్న దానిపై వివరాలు ఆరా తీశారు. బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. నిందితులను శిక్షించాలంటూ డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులతో హాస్పిటల్‌ ‌వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply