Take a fresh look at your lifestyle.

సీనియర్ల సూచనలు, సలహాలతో ముందుకు

  • కొత్తగా పిసిసి చీఫ్‌ ‌నియమితులైన ఎంపి రేవంత్‌ ‌రెడ్డి
  • హాస్పిటల్‌లో విహెచ్‌ను పరామర్శ..పొన్నాలతో భేటీ
  • దళితుల సమస్యలపై పోరాడుతానని వెల్లడి
  • కోమటిరెడ్డి లాంటి వారి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోని అధిష్టానం

కాంగ్రెస సీనియర్‌ ‌నేత వి.హనుమంతరావు తదితరుల సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానని పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డి తెలిపారు. వీహెచ్‌ ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శకు వొచ్చానని…ఆయన ఆరోగ్యం కుదటపడిందని అన్నారు. హాస్పిటల్‌లో ఉన్నా.. ప్రజా సమస్యలపై తనతో చర్చించినట్లు తెలిపారు. పార్టీ అభివృద్ధి విషయంలో కొన్ని సలహాలు ఇచ్చారని తెలిపారు. మేడమ్‌ ‌సోనియా గాంధీ వద్దకు స్వయంగా కలిసి వెళ్దామని చెప్పారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపై వీహెచ్‌ ఆం‌దోళన వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్‌ ‌చేస్తున్న ద్రోహంపై పోరాడాలని సూచించారని తెలిపారు. ప్రపంచంలో అతి పెద్ద ద్రోహి సీఎం కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు. పంజాగుట్టలో అంబేడ్కర్‌ ‌విగ్రహం పెడితే తీసుకెళ్లి పోలీస్‌ ‌స్టేషన్‌లో పెట్టారని మండిపడ్డారు. 125 అడుగుల అంబేడ్కర్‌ ‌విగ్రహం పెడతానని చెప్పి.. తట్టెడు మట్టి తీయలేదన్నారు. దళిత ఎంపవర్‌ ‌మెంట్‌ అని కేవలం నియోజకవర్గానికి వంద కుటుంబాలకు సహాయం అనడం ద్రోహమని వ్యాఖ్యానించారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామి నెరవేర్చలేదన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ ‌రెడ్డికి వీహెచ్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. అయితే గతంలో రేవంత్‌కి అధిష్ఠానం టీపీసీసీ చీఫ్‌ ‌పదవి ఇస్తే తాను కాంగ్రెస్‌ ‌పార్టీని వీడుతానని వీహెచ్‌ ‌వెల్లడించారు. తనతో పాటు చాలా మంది నేతలు పార్టీని వీడుతారని వ్యాఖ్యానించారు.

రేవంత్‌ ‌తెలంగాణ వ్యతిరేకి అని.. ఆయనకు టీపీసీసీ ఎలా ఇస్తారని వీహెచ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో ఉండి రేవంత్‌ ఆ ‌పార్టీనే ఖతం చేశాడని.. ఇప్పుడు కాంగ్రెస్‌ను కూడా ఖతం చేస్తాడని వీహెచ్‌ ‌మండిపడ్డారు. అలాంటి వీహెచ్‌ను రేవంత్‌ ‌వెళ్లి కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీహెచ్‌ ‌సైతం రేవంత్‌కు శుభాకాంక్షలు చెప్పి అభినందించడం గమనార్హం. విహెచ్‌ను పరామర్శించాక రేవంత్‌ ‌వి•డియాతో మాట్లాడారు.. వీహెచ్‌ ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపారు. ఆరోగ్యం పరిస్థితి సరిగా లేకపోయిన తనతో ప్రజా సమస్యలపై మాట్లాడారని వివరించారు. దళితుల అభివృద్ధికి కృషి చేసేవిధంగా ప్రభుత్వంపై వొత్తిడి తేవాల్సిన బాధ్యత తమపైనే ఉందని హనుమంతరావు గుర్తు చేశాడని తెలిపారు. కాగా వీహెచ్‌, ‌కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడుగా నియమితులైన రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతలతో వరుసగా సమావేశం అవుతున్నారు. సోమవారం ఉదయం మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడ నుంచి హైదర్‌గూడలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావును కలిసి పరామర్శించారు. అధిష్ఠానం టీపీసీసీ చీఫ్‌గా ప్రకటించాక ఆ పార్టీ సీనియర్‌ ‌నేతలను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు.

కోమటిరెడ్డి లాంటి వారి వ్యాఖ్యలను పట్టించుకోని అధిష్టానం
రేవంత్‌ ‌రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా చేయడంతో కాంగ్రెస్‌లో సహజంగానే ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. నిజానికి కాంగ్రెస్‌లో ఎవరికి వారు తామే పిసిసికి అర్హులమని, అవకాశమస్తే తామే సిఎంగా కూడా అర్హులమని చెప్పుకునే వారి జాబితా చాంతాడంత ఉంటుంది. అయితే తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రేవంత్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం పిసిసి చీఫ్‌గా నియమించింది. నిజానికి రేవంత్‌ ‌మాత్రమే ఇప్పుడున్న నేతల్ల అంతో ఇంతో ఛరిష్మా కలిగి ఉన్నారు అధిష్టానం మనోగతమయి ఉండవొచ్చు. అయితే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ ‌రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకున్నదే తడవుగా కొందరు తీవ్ర స్థాయిలోనే వ్యతిరేక స్వరాలు వినిపించారు. ఇది ముందునుంచీ ఊహిస్తున్నదే. అలాగే రేవంత్‌ ‌రెడ్డిని ఎంపిక చేయడంపై ఆ పార్టీలోకి కొందరు నేతలు గుర్రుగా ఉన్నారు. వేరే పార్టీ నుంచి వొచ్చిన వ్యక్తికి పీసీసీ పదవి ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు సీనియర్‌ ‌నేతలు కాంగ్రెస్‌ ‌పార్టీకి రాజీనామా చేశారు. ఇక రేవంత్‌ ‌రెడ్డి నియామకంపై కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఘాటు వ్యక్తులు చేశారు. డబ్బులు తీసుకోని టీపీపీసీ ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ..ఇకపై తాను గాంధీభవన్‌ ‌మెట్లు ఎక్కనని శపథం చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ వ్యాఖ్యలు హై కమాండ్‌ ‌దృష్టికి వెళ్లడంతో వారు కొంచెం సీరియస్‌ అయినా అంతగా పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగూర్‌ ‌రాష్ట్రంలోని నేతలకు ఫోన్‌ ‌చేసి కోమటిరెడ్డి వ్యాఖ్యల గురించి ఆరా తీశారు. కోమటిరెడ్డి మాటలను తర్జుమా చేసి పంపారు. ఇక ఇదే అంశంపై మాణిక్కం టాగూర్‌ ‌స్పందిస్తూ..హై కమాండ్‌ ‌తీసుకున్న నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాలని తెలిపారు. ఇక కోమటిరెడ్డి వ్యాఖ్యలు హై కమాండ్‌ ‌ను దిక్కరించేలా ఉన్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డికి షోకాజ్‌ ‌నోటీసు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ‌హైకమాండ్‌ ‌సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఇదిలా ఉంటే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హై కమాండ్‌ ‌సూచనతో కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు మల్లురవి, షబ్బీర్‌ అలీ ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌ ‌సూచనల మేరకే కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. మరో నేత మర్రి శశిధర్‌ ‌రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన కూడా పెద్దగా ప్రజాదరణ లేని వ్యక్తిగా కాంగ్రెస్‌లో మిగిలారు. వీరంతా ఎప్పటి నుంచో పిసిసి అధ్యక్ష పదవిని ఆవిస్తున్నవారే. మొత్తంగా రేవంత్‌ ‌నియామకంతో కాంగ్రెస్‌ ‌పార్టీ బలమైన సంకేతాన్ని ఇచ్చిందనేచెప్పాలి.

Leave a Reply