Take a fresh look at your lifestyle.

దళితబంధును ఆపాలని మేము జూలైలో ఈసీకి లేఖ రాసాం

ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్ ‌కన్వీనర్‌ ‌పద్మనాభరెడ్డి
దళితబంధును తాత్కాలికంగా నిలిపివేయాలని తాము ఈసీకి జులైలో లేఖరాశామని ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్ ‌కన్వీనర్‌ ‌పద్మనాభరెడ్డి అన్నారు. ఫిర్యాదు చేసిన 3 నెలల తర్వాత ఈసీ చర్యలు తీసుకోవడం బిగ్‌ ‌జోక్‌ అని ఆయన చెప్పారు. హుజురాబాద్‌ ఎన్నికల సమయంలో దళితబంధు ఇవ్వడం సరికాదని తమ అభిప్రాయమన్నారు.

అయితే దళితబంధుకు తాము వ్యతిరేకం కాదన్నారు. దళితబంధు ద్వారా వోటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే దళితబంధు చేపడుతున్నామని సీఎం అన్నప్పుడు ఎస్‌ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

Leave a Reply