Take a fresh look at your lifestyle.

కొరోనా కు చికిత్స పొందుతూ.. మాజీ కేంద్రమంత్రి, ఆర్‌ఎల్‌డి అధ్యక్షుడు అజిత్‌సింగ్‌ ‌మృతి

రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు
పివి, వాజ్‌పేయ్‌, ‌మన్మోమన్‌ ‌సింగ్‌ల ప్రభుత్వాల్లో పనిచేసిన అనుభం
అజిత్‌ ‌సింగ్‌ ‌మృతికి ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్‌ ‌తదితరుల సంతాపం

కొరోనా బారిన పడి  రాష్టీయ్ర లోక్‌ ‌దళ్‌(ఆర్‌ఎల్‌డీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌(82) ‌కన్నుమూశారు. గత నెల 20న కొరోనా బారిన పడిన ఈయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్‌ ‌కారణంగా మంగళవారం రాత్రి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున తుది శ్వాసవిడిచారు.తెలంగాణ ఉద్యమానికి అజిత్‌సింగ్‌   ‌సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ ‌కుమారుడైన అజిత్‌సింగ్‌ ‌రాజ్యసభ, లోక్‌సభ సభ్యుడిగానూ పని చేశారు. యూపీఏ హయాంలో పౌర విమానయాన మంత్రిగా అజిత్‌ ‌సింగ్‌ ‌బాధ్యతలు నిర్వర్తించారు. 1939 ఫిబ్రవరి 12న ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో అజిత్‌సింగ్‌ ‌జన్మించారు.  ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్‌, ‌చికాగో ఇల్లినాయిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీలో ఉన్నత విద్య అభ్యసించారు. అమెరికాలో 15 ఏండ్లపాటు కంప్యూటర్‌ ఇం‌డస్ట్రీలో పనిచేసిన ఆయన.. తన తండ్రి చరణ్‌ ‌సింగ్‌ ‌ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశానికి తిరిగి వచ్చారు. 1986లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్‌ ‌నియోజకవర్గం నుంచి ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని వీపీ సింగ్‌ ‌ప్రభుత్వంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా, పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆహార శాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి బయటకు వచ్చి రాష్టీయ్ర లోక్‌దళ్‌ ‌పార్టీ (ఆర్‌ఎల్డీ)ని స్థాపించారు. అనంతరం 2001లో వాజపేయి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2003 వరకు ఎన్‌డీఏ భాగస్వామిగా ఉన్నారు. 2004లో కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలికారు.  అజిత్‌ ‌సింగ్‌ ‌మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రైతు ప్రయోజనాల కోసం అంకితభావంతో పని చేశారని కొనియాడారు. కేంద్రంలో పలు విభాగాల బాధ్యతలను సమర్థంగా నిర్వహించారని మోదీ అన్నారు.

 సీఎం కేసీఆర్‌ ‌సంతాపం
ఆర్‌ఎల్‌డీ అధినేత మృతి చెందడంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌సంతాపం ప్రకటించారు. చరణ్‌సింగ్‌ ‌వారసత్వాన్ని సమర్థంగా కొనసాగించారని కొనియాడారు. రైతు నేతగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అజిత్‌ ‌సింగ్‌ ‌మద్దతు తెలిపారని సీఎం గుర్తు చేసుకున్నారు. కేసీఆర్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా అజిత్‌ ‌సింగ్‌ ‌మృతి పట్ల సంతాపం తెలిపారు. అజిత్‌ ‌సింగ్‌ ‌మృతి పట్ల మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌తీవ్ర దిగ్బ్రాతి వ్యక్తం చేశారు. అజిత్‌ ‌సింగ్‌ ‌తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు తెలిపారని గుర్తు చేసుకున్నారు. అజిత్‌ ‌సింగ్‌ను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని ఈటల అన్నారు. రాష్ట్ర ప్రజలందరి తరపున ఆయన కుటుంబ సభ్యులకు ఈటల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని ఈటల రాజేందర్‌ ‌తెలిపారు. అజిత్‌సింగ్‌ ‌మృతికి మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత బిజెపి నేత కపిలవాయి దిలీప్‌ ‌కుమార్‌ ‌సంతాపం తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ఆయన మద్దతు తెలిపి ఏర్పాటుకు సహకరించారని అన్నారు.

Leave a Reply