బలవనర్మణానికి పాల్పడ్డ రైతు

సిద్ధిపేటజిల్లాలోనిజగదేవ్పూర్ మండలంలో గలలింగారెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తన భూమి తనకు దక్కదేమోనన్న భయంతో ఓ రైతు బలవనర్మణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్లితే…. మండలంలోని లింగారెడ్డిపల్లికి చెందిన బొక్కి లింగం(40) రైతు. తనకున్న 12ఎకరాల భూమిని ఐదేండ్ల కిందట పీర్లపల్లి శివారులో గల అవేసమీ అడ్డా వెంచర్ వారికి అగ్రిమెంటు చేశారు. అగ్రిమెంటు ద్వారా వచ్చిన డబ్బులతో మరోచోట భూమిని కొనుగోలు చేద్దామను కున్నారు. భూమికి కొంత అడ్వాన్స్ కూడా చెల్లించారు. అయితే, మిగతా డబ్బులను సరైన సమయంలో చెల్లించకపోవడంతో సదరు భూమి యజమాని భూమిని మరొకరికి అమ్ముకున్నారు. దీంతో వెంచర్ యజమాన్యం వద్దకు వెళ్లిన లింగం తన భూమికి సంబంధించిన అగ్రిమెంటు రద్దు చేయాలని అడిగారు. లింగం విజ్ఞప్తిని వెంచర్ యజమాన్యం తిరస్కరించింది. గత ఐదేండ్ల నుంచి వెంచర్‌కు చేసిన అగ్రిమెంటును రద్దు చేసేలా యజమాన్యాన్ని ఒప్పించాలంటూ మృతుడు లింగం గ్రామ పెద్దలను కోరుతూ వస్తున్నారు.
అయితే, వెంచర్ యజమాన్యం తాను చేసిన అగ్రిమెంటును రద్దు చేయ కుండా, తన భూమిని తీసుకుం టారేమోననీ భయంతో పాటు మానసిక వేదనకు గురై శుక్రవారం తన పొలంలో వేప చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భర్త భయం, మానసికవేదనతోనే ఆత్మహత్య చేసుకున్నాడనీ, తన భర్త ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవల్సిందిగా లింగం భార్య బీరవ్వ జగదేవ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీరవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపతిక్రి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: former suicide, galalingareddypally, venture, agreement,bokki lingam