Take a fresh look at your lifestyle.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు నిరుద్యోగాన్ని పెంచుతున్నాయి

  • ఆలోచన లేకుండా పెద్ద నోట్ల రద్దు
  • రాష్ట్రాల్లో గందరగోళంగా నిధుల పరిస్థితి
  • అసంఘటిత రంగం దెబ్బతింది
  • తాత్కాలిక చర్యలు సంక్షోభాన్ని తెరమరుగు చేయలేవు
  • మాజీప్రధాని మన్మోహన్‌ ‌ఘాటు వ్యాఖ్యలు
  • ప్రతీక్ష 2030 డెవలప్‌మెంట్‌ ‌సమ్మిట్‌ను ప్రారంభం

మాజీ ప్రధాని డా. మన్మోహన్‌ సింగ్ ‌తొలిసారిగా మోడీ నిర్ణయాలపై ఘాటుగా హెచ్చరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశంలో నిరుద్యోగాన్ని పెంచుతున్నాయని, అసంఘటిత రంగాన్ని కుదిపేస్తున్నాయని మాజీ ప్రధాన మంత్రి డాక్టర్‌ ‌మన్మోహన్‌ ‌సింగ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. సరైన ఆలోచన లేకుండా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. కేరళలోని రాజీవ్‌ ‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌స్టడీస్‌ ‌మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ‌ద్వారా ’ప్రతీక్ష 2030’ పేరుతో డెవలప్‌మెంట్‌ ‌సమ్మిట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ‌మన్మోహన్‌ ‌సింగ్‌ ‌మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనది కాదన్నారు. ఈ నిర్ణయం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదింపులు జరపడం లేదని విమర్శించారు. అసంఘటిత రంగం కుదుపులకు గురవుతోందన్నారు.

భారత ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంకు చేపడుతున్న తాత్కాలిక చర్యలు ప్రస్తుతం ముంచుకొస్తున్న సంక్షోభాన్ని తెరమరుగు చేయలేవని స్పష్టం చేశారు. ముంచుకొస్తున్న క్రెడిట్‌ ‌క్రైసిస్‌ ‌ప్రభావం చిన్న తరహా, మధ్య తరహా రంగాలపై పడుతుందని తెలిపారు. దూరదృష్టి లేకుండా అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన సంక్షోభం కారణంగా దేశంలో నిరుద్యోగం అత్యధికంగా ఉందని, అసంఘటిత రంగం దెబ్బతిందని చెప్పారు. కేరళ సహా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ నిధుల పరిస్థితి గందరగోళంగా ఉందని, రాష్టాల్రు మితివి•రి అప్పులు తెస్తున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో బ్జడెట్లపై మోయలేని భారం పడుతుందని తెలిపారు. సమాఖ్య వ్యవస్థ, రాష్టాల్రతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరపడం చాలా ముఖ్యమని భారత రాజ్యాంగం చెప్తోందని, ఇవి దేశ ఆర్థిక వ్యవస్థకు, రాజకీయ సిద్దాంతాలకు కీలకమైనవని చెప్పారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

కేరళలో సాంఘిక ప్రమాణాలు ఉత్తమంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో గట్టిగా దృష్టి పెట్టవలసిన రంగాలు కూడా ఉన్నాయన్నారు. రాష్ట్రం అధిగమించవలసిన అడ్డంకులు చాలా ఉన్నాయన్నారు. గడచిన రెండు, మూడేళ్ళలో అంతర్జాతీయంగా ఆర్థిక, వ్యాపార రంగాల్లో ప్రారంభమైన పతనం కోవిడ్‌-19 ‌మహమ్మారితో తీవ్రమైందని, దీని వల్ల కేరళ అంతర్జాతీయ ముఖచిత్రం బలహీన పడిందని చెప్పారు. వ్యవహారాల్లో డిజిటల్‌ ‌పద్ధతులు పెరుగుతుండటంతో ఐటీ రంగం పరిస్థితి బాగున్నప్పటికీ, పర్యాటక రంగం చాలా దెబ్బతిందన్నారు. కోవిడ్‌-19 ‌మహమ్మారి ప్రభావం పర్యాటక రంగంపై తీవ్రంగా ఉందన్నారు. రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబరులో ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ’ప్రతీక్ష 2030’ని కేరళ రాష్ట్రావృద్ధి కోసం ఓ దార్శనిక ప్రణాళికను శాసన సభ ఎన్నికలకు ముందే తయారు చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేశారు.

Leave a Reply