Take a fresh look at your lifestyle.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌కు కొరోనా

కొరోనా మహమ్మారి దేశాన్ని గజగజ వణికిస్తోంది. పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కరోనా సోకిన విషయం విదితమే. తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీకి కూడా కొరోనా పాజిటివ్‌ ‌నిర్దారణ అయింది. తనకు పాజిటివ్‌ ‌నిర్దారణ అయినట్లు ప్రణబ్‌ ‌ముఖర్జీ ట్వీట్‌ ‌చేశారు.

వేరే సమస్య వల్ల హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు.. తనకు కొరోనా పరీక్షలు నిర్వహించగా తనకు పాజిటివ్‌ ‌నిర్దారణ అయిందని, గత వారం రోజుల నుంచి తనను ఎవరైతే కలిశారో.. వారందరూ కొరోనా పరీక్షలు చేయించుకోవాలని మాజీ రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ ‌పరీక్షలు చేయించుకున్న తర్వాత స్వీయ నియంత్రణ పాటించాలని ప్రణబ్‌ ‌ముఖర్జీ కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!