Take a fresh look at your lifestyle.

యురేనియం తవ్వకాలను అడ్డుకొంటాం: మాజీ ఎంపీ విహెచ్‌

ప్రపంచం అంతా కొరోనో తో కొట్టుమిట్టాడుతున్న సమయంలో నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాల గురించి అన్వేషణ మళ్ళీ మొదలైందని మాజీ ఎంపీ విహెచ్‌ ‌తెలిపారు .యూరేనియం తవ్వకాల పై రాష్ట్ర ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని తెలియచేయాలని డిమాండ్‌ ‌చేశారు.సోమవారం గాంధీభవన్‌ ‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ …ఏప్రిల్‌ 23 ‌న కేంద్రం నుంచి తెలంగాణ లేఖ వచ్చిందని , నల్లమల అటవీ ప్రాంతంలో జంతువులు, వృక్షాలు తదితర వివరాలు కావాలని అడిగారని తెలిపారు.

ఇక మరోవైపు కేసీఆర్‌ ‌నల్లమలలో యురేనియం తవ్వకాలను జరపనివ్వం అంటున్నారు కానీ కేంద్ర మంత్రి ప్రకాష్‌ ‌జయదేవకర్‌ ‌మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యురేనియం తవ్వకాలు ఆగవని అంటున్నారు అసలు ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని అన్నారు.యురేనియం తవ్వకాలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వవద్దని ఒకవేళ ఇస్తే కాంగ్రెస్‌ ‌పార్టీ అడ్డుకొని తీరుతుందని విహెచ్‌ ‌హెచ్చరించారు.ఈ మీడియా సమావేశంలో వీహెచ్‌ ‌తో పాటు నాగర్‌ ‌కర్నూల్‌ ‌డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, టిపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ ‌లు పాల్గొన్నారు .

Leave a Reply