Take a fresh look at your lifestyle.

‌ప్రజాసేవలో మాజీ ఎంపీ పొంగులేటి

  • ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు శానిటైజర్‌, ‌మాస్కుల అందజేత
  • పిఎస్‌ఆర్‌ ‌ట్రస్ట్ ‌ద్వారా  మంత్రి పువ్వాడకు  అందించిన శ్రీనివాసరెడ్డి

ఖమ్మం ఏప్రిల్‌ 25,‌ప్రజాతంత్ర (ప్రతినిధి) : జిల్లా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడల్లా తానునంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అపూర్వ దాతీత్వంతో ప్రజలకు సేవలందిస్తూ …తన సాటిమరే వ్వరు లేరని తెలియజేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరు ణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలను కరోనా భారీ నుంచి రక్షించుకోవడానికి నిత్యం అవసరమైన శానిటైజర్లు, మాస్కుల ను పొంగులేటి అందిస్తున్నారు. కరోనా నుంచి రోగులను రక్షించే ఫ్రంట్‌లైన్‌ ‌ప్రజా సేవలకు పొంగులేటి తన దాతృత్వంతో అండగా నిలుస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20 వేల లీటర్ల శానిటైజర్లు, మాస్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అందించారు. వాటిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ఎం‌వీరెడ్డి, ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ల ద్వారా మంత్రి పువ్వాడ జిల్లాలోని మున్సిపల్‌, ‌పంచాయతీ కార్మికులకు వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీస్‌, ‌రెవెన్యూ, పంచా యతీరాజ్‌ ‌శాఖల అధికారులకు ఉద్యోగు లకు ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాం గం ద్వారా పంచాయతీలకు పంపిం చేలా ప్రణాళికలు చేశారు. ఖమ్మం జిల్లా పరిషత్‌ ‌కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌కు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా సరెడ్డి వాటిని అందజేశారు.

కరోనా కట్టడిలో తానుసైతం….

- Advertisement -

Former MP Ponguleti in public service

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి సమయంలో ఎంపీ పొంగుటేటి శ్రీనివాస•రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వచ్చి కరోనాను ప్రారదోలేందుకు నేను సైతం ముందుటానని ప్రజలకు భరోసా కల్పించారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన పొంగులేటి  ఈ సారి సేవా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారనే సమయంలో ఆయన ఏలాంటి ఆర్బాటం లేకుండా ఏకంగా శానిటైజర్లు, మాస్కుల తో వచ్చి ప్రల్లోకి వచ్చి అందరూ నివ్వెరపోయేలా చేశారు. కరోనా యుద్దంలో భాగస్వాములుగా ఉన్న  గ్రామ పంచాయతీ కార్మికులకు, పోలీసులకు, వైద్యఆరోగ్యశాఖ సిబ్బందికి వీటిని అందించేలా చర్యలు చేపట్టారు. అలాగే జిల్లాలో వివిధ ప్రాంతా ల్లో నిరుపేదలకు నిత్యవసర వస్తువులు అందించేలా చర్యలు చేపడుతున్నారు. పిఎస్‌ఆర్‌ ‌ట్రస్ట్ ‌నుంచి ప్రజలకు సేవా కార్యక్రమాలను విసృత పరిచేలా ప్రణాళికలు చేశారు.

Leave a Reply