Take a fresh look at your lifestyle.

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి సిఎం కెసిఆర్‌ ‌సహా పలువురు నేతల సంతాపం

కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య అనారోగ్యంతో  మరణించారు. జులై 29న అనారోగ్యంతో నిమ్స్‌లో  చేరిన నంది ఎల్లయ్య, శనివారం ఉదయం 10.30 గంటలకు తుది శ్వాస విడిచారు. దేశంలో చాలా కీలకమైన కాంగ్రెస్‌  ‌నేతల్లో నంది ఎల్లయ్య ఒకరు. ఆయన 6 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. కొంతకాలం ఎమ్మెల్సీగా కూడా పని చేసారు. ఓటమి ఎరగని నేతగా నంది ఎల్లయ్య…సిద్దిపేట లోకసభ నియోజకవర్గం నుండి 6వ, 7వ, 9వ, 10వ, 11వ లోకసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో నాగర్‌కర్నూల్‌ ‌లోకసభ నియోజకవర్గం నుండి పోటిచేసి మంద జగన్నాథంను ఓడించి 16వ లోకసభకు ఎన్నికయ్యాడు. 2014 వరకు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
సిఎం కెసిఆర్‌ ‌సంతాపం
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నంది ఎల్లయ్య రాజకీయనేతగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారన్నారు. నంది ఎల్లయ్య  కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటని అన్నారు.
పలువురు నేతల సంతాపం
నంది ఎల్లయ్య అకాల మరణం పట్ల పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి ఆర్‌.‌సి కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌ ‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు సంపత్‌ ‌కుమార్‌, ‌వంశీచంద్‌ ‌రెడ్డి, మాజీ ఎంపీలు వి .హనుమంతరావు, పొన్నం ప్రభాకర్‌, అం‌జాన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, గీత రెడ్డి తతితర నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. నంది ఎల్లయ్య సోదరుడితో కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్‌ ‌ఫోన్‌లో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. నంది ఎల్లయ్య కాంగ్రెస్‌ ‌పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిబద్దత తో క్రమశిక్షణతో పనిచేసారని ఆయన క్రమశిక్షణ నేటి తరానికి ఆదర్శమని నేతలు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!