Take a fresh look at your lifestyle.

‌ప్రజలకు సేవ చేసేందుకే పునర్జన్మ ఎత్తివచ్చా

  • నైతిక విజయం నాదే
  • పోలీసులు చొక్కా లేని టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు

సూర్యాపేట, జులై 14, ప్రజాతంత్ర ప్రతినిధి): ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు తిరిగి నన్ను పంపించాడని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెడ్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ‌కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని గుర్తుచేశారు. ఇప్పటివరకు మంత్రి జగదీష్‌రెడ్డికి ఎన్నడూ విమర్శించలేదని వెంటనే కరోనా నిర్మూలనలకు తీసుకోవాల్సిన చర్యలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఎన్నికల సమయంలో, కరోనా వంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిచేయాలని తెలిపారు. ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ గెలిచిందని, నైతికంగా విజయం తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌విలయతాండవం చేస్తుంటే సెక్రటరియేట్‌ ‌కూల్చివేయడం అమానుషమని, అట్టి సెక్రటరియేట్‌ను తాత్కాలికంగా కరోనా వైరస్‌ ‌రోగులకు చికిత్స అందించే స్థలంలాగా అయిన వాడుకోవాలని సూచించారు.

తన కార్యకర్తలకు అన్యాయం జరిగితే లక్ష మందితో పోలీస్‌ ‌స్టేషన్ల ముట్టడికి రూపల్పన చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు చొక్కాలేని పోలీసులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లాలో కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందడానికి మంత్రి జగదీష్‌రెడ్డి కారణమని ఎద్దెవ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కా•గ్రెస్‌ ‌నాయకులు కొప్పుల వేణారెడ్డి, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్‌,‌తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ ‌గుడిపాటి నర్సయ్య, పిసిసి అధికారి ప్రతినిధి చకిలం రాజేశ్వర్‌రావు, ఐఎన్‌టియూసి జిల్లా వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌చెంచల శ్రీనివాస్‌, ‌చివ్వెంల బ్లాక్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షులు వేములపల్లి వాసుదేవరావు, వేణుగోపాల్‌, ‌కక్కిరేణి శ్రీనివాస్‌, ‌బైరు శైలేందర్‌, ఓబీసీ సెల్‌ ‌పట్టణ అధ్యక్షులు రావుల రాంబాబు, కరుణాకర్‌ ‌రెడ్డి, రమేష్‌, ‌శేఖర్‌, ‌వెన్న మధుకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!