Take a fresh look at your lifestyle.

నాకు వొటేస్తానంటే దళితబంధు ఇవ్వనంటున్నారు

  • ప్రతి పల్లెలోనూ దావత్‌ అడ్డాలు వెలిసాయి
  • చిన్నపిలలకు కూడా మద్యం అలవాటు చేస్తున్నారు
  • నా రాజీనామాతో హుజూరాబాద్‌లో అందరికీ పదవులే పదవులు
  • వీణవంక ప్రచారంలో మాజీమంత్రి ఈటల

‘‌నాకు వోటేస్తే దళితబంధు ఇవ్వనంటున్నారట. దళితబంధు నీ అబ్బ జాగీరా.. మిస్టర్‌ ‌ముఖ్యమంత్రి’ అని ఈటల రాజేందర్‌ ‌ప్రశ్నించారు. దళితబంధు అర్హులందరికీ ఇచ్చి మాట్లాడాలన్నారు. అంతకు ముందు మన ముఖం చూడని ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాల్లో అడ్డాలు పెట్టి మరీ దావత్‌లు ఇస్తున్నారని ఆయన అన్నారు. వీణవంక మండలం మల్లన్నపల్లిలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ‌పర్యటించారు. కోలాటాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈటల సమక్షంలో పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘నేను రాజీనామా చేయకపోతే..ఇంతమందికి హుజూరాబాద్‌లో పదవులు వొచ్చేవా? మికు ప్రగతిభవన్‌లో ప్రవేశం దొరికిందంటే అది నావల్ల కాదా? అంతకు ముందు మన ముఖం చూడని ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాల్లో అడ్డాలు పెట్టి దావత్‌లు ఇస్తున్నారు. గొర్రెల మంద మిద పిచ్చికుక్కలు దాడి చేసినట్లు..

నామిద దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రతి పల్లె..దావత్‌లకు అడ్డాగా మారింది. చిన్న పిల్లలను కూడా తాగుడుకు అలవాటు చేస్తున్నారు. ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు. బాధ్యత గల మంత్రుల్లారా..మిరు చేయాల్సింది ఇలాంటి పనులేనా? రోజు ఇక్కడికి వొచ్చి, చిటికెలు వేసి నాయకులను కొనుగోలు చేస్తున్న హరీష్‌ ‌రావును అడగండి. ఆయన దగ్గర దళితబంధు ఇస్తున్నారా? హరీష్‌ ‌రావు నాయకులను పిలిపించుకుని.. బీజేపీలో నాయకులు ఇంకా ఎందుకు మిగిలారని బెదిరిస్తున్నాడట. అర్ధరాత్రి కార్లు వేసుకుని ఇండ్లలోకి వొచ్చి..మా దగ్గరకు రా అని వేధిస్తున్నారట. మిరు పిడికెడు మందిని వశం చేసుకోవచ్చు..కానీ ప్రజలను మాత్రం వశం చేసుకోలేరు. అన్ని గ్రామాల ప్రజలు..కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా నీవెంటే ఉంటామని నాకు హామి ఇస్తున్నారు. నా మిద మి కుల ప్రయోగం నడవదు. ఈ ఒక్క గ్రామానికే నేను పదులసార్లు వొచ్చాను. ప్రతి కాలువ గట్టుమిద, ప్రతి వాడల్లో నా పాద ముద్రలున్నాయి. వీణవంక వాగుపై నేను కట్టించిన చెక్‌ ‌డ్యాంల వల్ల జలహారంగా మారింది. నా మిద మాట్లాడే మంత్రులు..గ్రామాలలో నేను చేసిన అభివృద్ధి చూడాలి. ఇక్కడకు వొచ్చే లీడర్లు చిల్లరగా మాట్లాడుతున్నారు. నామిద చిల్లర ఆరోపణలు చేస్తే సూర్యుడి మిద ఉమ్మెసినట్లే అవుతుంది. మా వాళ్లను మిరు పెట్టే హింసను చూసి ఇలా మాట్లాడాల్సి వొస్తుంది.

వాళ్ల బాధలు చెబుతుంటే..నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. మనం కొనే వస్తువులకు కట్టే పన్నుల ద్వారా వొచ్చే ఆదాయం మళ్లీ మనకు ఇస్తున్నారు తప్ప..వాళ్ల జేబుల నుంచి మనకేమి ఇవ్వడం లేదు. కేవలం మద్యం మిదనే ప్రభుత్వానికి 30 వేల కోట్ల ఆదాయం వొస్తుంది. మన పైసలకు కాపాలాదారుగా ఉండాల్సినోడు..మనమిద అధికారం చెలాయిస్తే ఊరుకుంటామా? ప్రజల సొమ్ముకు వాళ్లు కేర్‌ ‌టేకర్లు మాత్రమే. నా వెంట ఒక్కరిని కూడా ఉండనీయడట. అది మికు సాధ్యమవుతుందా? ఒక్కరు పోతే..నాకు వంద మంది అండగా ఉంటారు. నాయకులు పోతే పోనీ.. మేమున్నామని ప్రజలు నాకు భరోసా ఇస్తున్నారు. నాతో పాటు మూడ్నెళ్లపాటు తిరిగినోళ్లు కూడా పోయారు. గత 20 ఏళ్ల కింద ఎలా ఉన్నానో.. ఇవాళ కూడా అలాగే ఉన్నా. మి దగ్గర నేను ఏనాడు దావతుల్లో కూర్చోవడానికి రాలేదు. మికు ఆపద వొస్తే ఆదుకునేందుకు మాత్రమే వొచ్చాను.

నా ఇంటికి ఎవరు వొచ్చినా..మి బాధేంది అని అడిగాను తప్ప..కులం గురించి అడిగానా? ఇక్కడ కొట్లాట నాకు, కేసీఆర్‌కు మాత్రమే. ఇక్కడకొచ్చే నాయకులతో కాదు. మిరు ఎన్ని స్కీమ్‌లు పెట్టినా, ఎంత ఖర్చు చేసినా, చివరికి మిరు మోకాళ్ల మిద నడిచినా మికు వోట్లు పడవు. నా మిద జరుగుతున్న దాడిని ఆపగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. ఓ పోరగాన్ని నామిద పెట్టి నన్ను ఖతం పట్టిస్తారట..మితో సాధ్యమవుతుందా? నేను చనిపోయిన నాడు నా ప్రజలు కంటనీరు పెట్టేలా బతకాలనుకుంటున్నా. దళితబంధు ఇస్తున్నాం, పింఛన్‌ ఇస్తున్నాం కాబట్టి ఇంటి మిద జెండా పెట్టుకోవాలని వేధిస్తున్నారట. అవి మి డబ్బులు కాదు..మి ఇంట్లో నుంచి ఇవ్వడం లేదు. మిరు పథకాల ద్వారా డబ్బులిచ్చి నన్ను పొడవమని కత్తి ఇస్తే ప్రజలు పొడుస్తారా? ఈ స్కీమ్‌లన్నింటి వెనక నన్ను ఓడించాలనే కుట్ర తప్ప ఇంకేమి లేదు’ అని ఈటల రాజేందర్‌ అన్నారు.

Leave a Reply