Take a fresh look at your lifestyle.

మాజీమంత్రి చందూలాల్‌ ‌కన్నుమూత

  • సిఎం కెసిఆర్‌ ‌సహా పలువురు  నేతల సంతాపం
  • అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశం

తెలుగుదేశంలో తొలితరం నేతగా, గిరిజన నాయకుడిగా పేరు సంపాదించుకున్న ఆజ్మీరా చందూలాల్‌ అనారోగ్యంతో కన్నుమూసారు. సాధారణ వ్యక్తిగా, సర్పంచ్‌ ‌స్థాయి నుంచి రాజకీయాల్లోకి వొచ్చిన చందూలాల్‌ ‌దివంగత ఎన్టీఆర్‌ ‌ప్రోత్సాహంతో రాష్ట్ర మంత్రిగా వెలుగులోకి వచ్చారు. మచ్చలేని స్వచ్ఛమైన రాజకీయ నేతగా తనదైన ముద్ర వేసుకున్నారు. రాజకీయాల్లో అజాతశత్రువుగ ఆపేరుగాంచిన మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ (67) ‌శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలం కిందట కిడ్నీలు విఫలమవగా, మార్పిడి చేసినా ఆరోగ్యం కుదుట పడలేదు. అప్పటి నుంచి డయాలసిస్‌పైనే ఆధారపడుతున్నారు.

పది రోజుల కిందట వరకు బాగానే ఉన్నప్పటికీ, ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై కిమ్స్ ‌హాస్పిటల్‌లో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి 11 గంటలకు మృతి చెందారు. ప్రస్తుత ములుగు జిల్లా జగ్గన్నపేటలో 17 ఆగస్టు 1954న జన్మించిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా పలుమార్లు గెలిచి ఉమ్మడి ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాల్లో పదవులు నిర్వర్తించారు. చందూలాల్‌కు భార్య శారద, కుమారుడు ప్రహ్లాద్‌, ‌ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

సిఎం కెసిఆర్‌ ‌సహా పలువురు  నేతల సంతాపం
మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ ‌మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చందూలాల్‌, ‌ములుగు శాసనసభా స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా,  రెండుసార్లు వరంగల్‌ ఎం‌పీగా గెలుపొందారని, రెండుసార్లు మంత్రిపదవి చేపట్టి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ ‌పొలిట్‌ ‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన చందూలాల్‌ ‌నూతన తెలంగాణ రాష్ట్రంలో తన మంత్రివర్గంలో గిరిజన సంక్షేమం, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో మంత్రిగా రాష్ట్రానికి, గిరిజనులకు చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు.

మాజీ మంత్రి చందూలాల్‌  ‌మరణం పార్టీకి తీరనిలోటని అన్నారు. చందూలాల్‌ ‌కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ ‌తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించారు. చందూలాల్‌ ‌మృతికి మాజీమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావుతో పాటు మంత్రి కేటీఆర్‌, ‌తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply