Take a fresh look at your lifestyle.

సీఎం కేసీఆర్‌ ‌పాలనలో రైతే రాజు

సీఎం కేసీఆర్‌ ‌హయాంలో రైతును రాజుగా చేయాలనే తపనతో పాలన కొనసాగుతుందని ప్రతి రైతు పండించిన కందులను మద్దతు ధర కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వమే కందులను కొనుగోలు చేస్తుందని పీఏసీఎస్‌ ‌చైర్మన్‌ ‌నిమ్మతి మహేందర్‌ ‌రెడ్డి అన్నారు. బుధవారం వ్యవసాయ మార్కెట్‌ ‌యార్డులో ఏర్పాటుచేసిన మార్క్‌ఫెడ్‌ ‌కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

అనంతరం మార్కెటింగ్‌ ‌డీఎం నాగేశ్వర శర్మ, సివిల్‌ ‌సప్లై డీఎం రాంపతి, మార్కెట్‌ ‌ప్రత్యేక శ్రేణి కార్య దర్శి జీవన్‌ ‌కుమార్‌, ‌డీఎస్‌వో రోజారాణి, పీఏసీఎస్‌ ‌సీఈవో విద్యాసాగర్‌ ‌రావులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ మార్క్‌ఫెడ్‌ ‌కేంద్రంలో మద్దతు ధరకు కందులను కొనుగోల నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులకు గురవుతారని, మరికొన్ని రోజులు కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలన్నారు.ఈ విషయం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వివరించారు.

Leave a Reply