Take a fresh look at your lifestyle.

కోవిడ్‌ చికిత్స పొందుతూ సోరాబ్జి మృతి

  • సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని
  • ఆయన న్యాయం కోసం పోరాడాడన్న జస్టిస్‌ ‌రమణ
  • సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్‌

‌కొవిడ్‌ ‌మహమ్మారితో మరో ప్రముఖుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రఖ్యాత న్యాయనిపుణుడు, మాజీ అటార్నీ జనరల్‌ ‌సోలీ జహంగీర్‌ ‌సోరాబ్జీ(91) శుక్రవారం ఉదయం దిల్లీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌ ‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 1930లో ముంబయిలో జన్మించిన సోరాబ్జీ 1953లో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. 1971లో సుప్రీంకోర్టు ఆయనను సీనియర్‌ అడ్వొకేట్‌గా గుర్తించింది. 1989-90, 1998-2004 మధ్య భారత అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సోరాబ్జీ మానవ హక్కులపై విశేష కృషి చేశారు. 1997లో నైజీరియాలో మానవ హక్కుల పరిస్థితిపై అధ్యయనం కోసం ఐక్యరాజ్య సమితి  ఆయనను ప్రతినిధిగా పంపింది. అనంతరం ఐరాస ’ప్రమోషన్‌ అం‌డ్‌ ‌ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ‌హ్యూమన్‌ ‌రైట్స్’ ఉప సంఘానికి ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1998-2004 మధ్య ఐరాస నియమించిన ’ప్రివెన్షన్‌ ఆఫ్‌ ‌డిస్క్రిమినేషన్‌ అం‌డ్‌ ‌ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ‌మైనారిటీస్‌’ ఉప సంఘంలో సభ్యుడిగానూ ఉన్నారు.

’ది హేగ్‌’‌లోని మధ్యతర్తిత్వ న్యాయస్థానంలో 2000-2006 మధ్య శాశ్వత సభ్యుడిగా కొనసాగారు. వాక్‌ ‌స్వాతంత్య్ర, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన పలు కీలక కేసుల్లో సొరాబ్జీ తన వాదనలు వినిపించారు. అందులో భాగంగా అనేక ప్రచురణలపై నిషేధాన్ని ఎత్తివేయించారు. దీనిపై విస్తృత స్థాయిలో అధ్యయనం చేసిన ఆయన ’లా ఆఫ్‌ ‌ప్రెస్‌ ‌సెన్సార్‌షిప్‌ ఇన్‌ ఇం‌డియా’, ’ద ఎమ్జ్గ•న్సీ, సెన్సార్‌షిప్‌ అం‌డ్‌ ‌ది ప్రెస్‌ ఇన్‌ ఇం‌డియా’ వంటి పుస్తకాలను రచించారు. మనేకా గాంధీ వర్సెస్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ఇం‌డియా(1978), ఎస్‌ఆర్‌ ‌బొమ్మై వర్సెస్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ఇం‌డియా(1994), బీపీ సింఘాల్‌ ‌వర్సెస్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ఇం‌డియా(2010) వంటి ల్యాండ్‌మార్క్ ‌కేసుల్లో సోరాబ్జీ తన వాదనలు వినిపించారు.

ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.  సొలిసొరాబ్జీ మరణం దేశానికి తీరని లోటు అని రాష్ట్రపతి రామ్‌ ‌నాథ్‌ ‌కోవింద్‌ ‌పేర్కొన్నారు. ఆయన దేశ న్యాయవ్యవస్థకు ప్రతీక అని కీర్తించారు. భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ ఉన్నతి కోసం విశేష కృషి చేసిన వారిలో సోలీ సొరాబ్జీ ఒకరని రాష్ట్రపతి కొనియాడారు. దేశంలోని ప్రముఖ న్యాయ కోవిదుల్లో ఒకరైన సోలీ సొరాబ్జిని భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌ ‌పురస్కారంతో సత్కరించిందని గుర్తుచేశారు.ఆయన మృతికి ప్రధాని నరేంద్రమోదీ, చీఫ్‌ ‌జస్టిస్‌ ఆఫ్‌ ఇం‌డియా ఎన్వీ రమణ కూడా సంతాపం తెలియజేశారు. సోరాబ్జీ న్యాయం కోసం పోరాడిన వ్యక్తిగా దేశ చచరిత్ర పుటల్లో నిలిచి పోతారని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రమణ అన్నారు. సొలి సొరాబ్జీ మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. సొరాబ్జీ మరణవార్త తనను కలచివేసిందని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Leave a Reply