Take a fresh look at your lifestyle.

“పాపాన్ని క్షమించడం పాపం కన్నా తీవ్రమైనది..”

  • నిజాముద్దీన్‌ ‌ఘటన.. ఆత్మావలోకనానికి తగిన సమయం

ఢిల్లీ నిజాముద్దీన్‌లోని ఒక మసీదులో మత సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకు మలేసియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిస్థాన్ల నుంచి వేలాది మంది హాజరయ్యారు. వీరిలో 175 మందికి కొరోనా వైరస్‌ ‌సోకిందన్న అనుమానంతో వీరందరికీ పరీక్షలు నిర్వహించారు. ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం ఇదే ప్రథమం. ఈ సమావేసాలకు వేలాది మంది భారతీయులు, విదేశీయులు హాజరయ్యారు. దాంతో ఈ సమావేశాలకు హాజరైన వారందరికీ ఈ వైరస్‌ ‌సోకిందన్న అనుమానం వ్యక్తం అయింది. దాంతో జనం భయంతో వణికి పోయారు. మార్చి మధ్యలో బంగ్లావాలీ మసీదులో తబ్లీగీ జమాత్‌ ‌ప్రచారకులు వచ్చి జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వారి ప్రసంగాలను వినేందుకు వేలాది మంది హాజరయ్యారు. దీంతో ఈ సమావేశాలకు హాజరైన వారందరికీ వైరస్‌ ‌సోకిందేమోనన్న అనుమానం సర్వత్రా వ్యక్తం అయింది. కోవిడ్‌ -19 అనుమానితులను కనుగొనేందుకు పెద్ద ఎత్తున తనిఖీలను నిర్వహించారు. ముస్లిం వర్గాల్లో అంతర్లీనంగా ఉన్న క్రమశిక్షణా రాహిత్యాన్ని ఈ సంఘటన బయటపెట్టింది. ముఖ్యంగా లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో జనం గుమిగూడరాదన్న ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టి వేలాది మంది హాజరు కావడాన్ని అలా కాక ఏమనుకోవాలి. కొరోనా వైరస్‌ ‌ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తున్న విపత్తు. ఇందుకు చికిత్సా విధానం ఎవరికీ ఇప్పటికీ తెలియదు. కానరాని శత్రువుతో ప్రపంచ దేశాలు యుద్ధాన్ని చేస్తున్నాయి. ఇప్పటికీ ఒక్క క్లూ కూడా కనిపించలేదు.

ఇలాంటి ఘోరమైన మానవ సంక్షోభం విషయంలో ఖురాన్‌ ఏం ‌చెబుతోంది. ఇలాంటి విపత్తులను గతంలో సంభవించిన విపత్తుల కోణం నుంచి చూడాలి. అప్పటి అనుభవాలను జనం దృష్టిలో ఉంచుకోవాలి. అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేయకూడదు. అవే నేరాలను మళ్ళీ చేయకూడదు. కొరోనాకి వ్యతిరేకంగా తీసుకోవల్సిన జాగ్రత్తలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అవి ఇస్లాం మత గ్రంథంలో ప్రబోధించిన మార్గదర్శకాలను పోలి ఉన్నాయి. మహమ్మద్‌ ‌ప్రవక్త ఇలాంటి వైరస్‌లను ఎదుర్కోవడానికి ఇచ్చిన మార్గదర్శకం ఏమంటే అంటు వ్యాధులు వ్యాపించినప్పుడు క్వారంటైన్‌ అమలు చేయాలి. హదిత్‌లో ప్రవక్త ఏం చెప్పారంటే ఆరోగ్యవంతుణ్ణి అనారోగ్యవంతునికి దూరంగా ఉంచాలని. మరి అలాంటప్పుడు నిజాముద్దీన్‌లో తబ్లీగీ మౌలానాలు, ముఫ్తీలు ప్రవక్త మార్గదర్శకాలను పాటించలేదని స్పష్టం అవుతోంది. అలాగే, పవిత్ర ఖురాన్‌లోని ప్రబోధాలను పాటించలేదని స్పష్టం అవుతోంది. మత విశ్వాసకులకు నిజాముద్దీన్‌ ‌వంటి సమావేశాల్లో చేసే ప్రబోధాలు పరిశీలిస్తే ఇస్లాంకి వారెంత దూరంగా జరిగిపోయారో స్పష్టం అవుతోంది. జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కేవలం ఆసక్తి కలిగించే ఊహాగానాల స్థాయికి దిగజార్చలేం ఈ రెండు వేరువేరు కావు.

ఇస్లాం బోధించే తహ్వీద్‌ ఇస్లాం ప్రాథమిక విశ్వాసమైన అందరిలో దేవుడున్నాడు, అందరూ సమానమేనన్న భావానికి వ్యతిరేకంగా చెబుతుందని నేను అనుకోవడం లేదు. అలాగే, ఆ భావాన్ని తక్కువ చేస్తుందని అనుకోవడం లేదు. అయితే, ఇస్లాంకి స్వయం ప్రకటిత సంరక్షకులమని చెప్పుకునే వీరంతా పవిత్రమైన ఇస్లాం సిద్ధాంతాలను చాపచుట్టారేమో ననిపిస్తోంది. కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి వంటి క్లిష్ట సమయాల్లో సామాజిక దూరాన్ని పాటించాలన్న ప్రబోధాలు వారు చేసి ఉండేవారే. ముఫ్తీలు, మౌలానాలు ఇస్లాంకు అర్హులైన బోధకులు కారేమోనని పిస్తోంది. సున్నీ(భారతీయ) ముస్లింలలో తీవ్రమైన మార్పులు రావాలనే వాదం చాలా కాలంగా ఉంది. దేశమంతటా కొరోనా వైరస్‌ ‌వ్యాపిస్తున్న వేళ ఇలాంటి పెద్ద సమావేశాలను నిర్వహిస్తే వచ్చే దుష్ఫలితాలను వారు గ్రహించ లేదనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ముస్లింలు ఆత్మావలోకనం చేసుకోవడం ఎంతైనా అవసరం. భారత్‌లో లౌకిక పునాదులు బలంగా ఉన్నాయి కానీ, ముస్లింలు వాటికి దూరం అవుతూ వస్తున్నారు. ఈ దేశంలో అన్ని మతాలు, వర్గాలు, విశ్వాసాల వారికి సమానమైన అవకాశాలు ఉన్నాయి. నిజాముద్దీన్‌ ‌ఘటన వంటివి మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ముస్లిం మత పెద్దలపై ఉంది. బాధితులమని చెప్పుకోవడం సులభమే. కానీ, అది అన్ని వేళలా ఉపయోగపడదు. ముస్లింలు ఆత్మావలోకనం చేసుకోవాలి.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply