Take a fresh look at your lifestyle.

అడవుల పునరుజ్జీవనం, సంరక్షణ పోలీస్‌ ‌శాఖ తమవంతు సహకారం

  • అన్ని జిల్లాల్లో సిద్దిపేట నమూనా అమలయ్యేలా చర్యలు
  • పాత్రికేయుల సమావేశంలో డిజిపి మహేందర్‌ ‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో అడవుల పునరుజ్జీవనం, సంరక్షణ కార్యక్రమాలలో పోలీస్‌ ‌శాఖ తమవంతు సంపూర్ణ సహకారం అందిస్తుందని డిజిపి మహేందర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. అడవుల పునరుజ్జీవనం, ప్లాంటేషన్‌, ‌సంరక్షణ కార్యక్రమాలలో సిద్దిపేట అవలంభిస్తున్న విధానాలను అన్ని జిల్లాలో యథావిధిగా అమలయ్యేలా తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. బుధవారం కోమటి బండ మిషన్‌ ‌భగీరథ ప్లాంట్‌ ‌మీటింగ్‌ ‌హాల్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డిజిపి మహేందర్‌ ‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరిత హరం కార్యక్రమంలో
పోలీస్‌ ‌శాఖ అన్ని శాఖలతో కలిసి ముందుకు వెళుతుందని డిజిపి తెలిపారు. గజ్వేల్‌ ‌ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అటవీ పునరుజ్జీవన, ప్లాంటేషన్‌, ‌సంరక్షణ కార్యక్రమాలు ప్రభావ వంతంగా అమలయ్యేలా చుస్తున్నందున…. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు జిల్లా యంత్రాంగం ఎట్లా కార్యక్రమాలు చేపడుతుందని అధ్యయనం చేసేందుకు సీనియర్‌ ఐపిఎస్‌ అధికారులు క్షేత్ర పరిశీలన చేశామన్నారు.

అటవీశాఖ పీసీసీఎఫ్‌ ఆర్‌.‌శోభ, జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామ రెడ్డి సంయుక్తంగా అన్ని కార్యక్రమాలు చూపించారన్నారు. గజ్వేల్‌ అధునాతన సమీకృత మార్కెట్‌ ‌విక్రేతలకు, వినియోగదారులకు అనువుగా ఉందన్నారు. ముట్రాజ్‌ ‌పల్లి, తునికిబోల్లారం ఆర్‌ అం‌డ్‌ ఆర్‌ ‌కాలనీలో ఇంటి నిర్మాణాలు, వసతులు, ఎడ్యుకేషన్‌ ‌హబ్‌లో మౌలిక సదుపాయాలను పరిశీలించామని డిజిపి తెలిపారు. పోలీస్‌ అధికారులను సెన్సిటైజ్‌ ‌చేసేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందన్నారు. ఇక్కడ జరిగిన, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమ జిల్లాలో చేపట్టేందుకు ఎస్పి కృషి చేస్తారని అన్నారు. సిద్దిపేట జిల్లాలో 23 వేల హెక్టార్లకు గానూ 21 వేల హెక్టార్ల రిజర్వ్ ‌ఫారెస్ట్‌లో అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలు చేపట్టి మంచి ఫలితాలు సాధించారని అన్నారు. క్షేత్ర స్థాయిలో సానుకూల ఫలితాలు తమను అచ్చర్యపరిచయాన్నారు.

క్షేత్ర స్థాయి పరిశీలన తమకు సంతృప్తి నిచ్చిందన్నారు. కార్యక్రమాలు ప్రభావ వంతంగా అమలుకు ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్‌, ‌సిపి, జిల్లా అటవీ అధికారి బృందానికి డీజీపి అభినందనలు  తెలిపారు. అడవుల పునరుద్ధరణకు ఈ బృందం చేసిన వ్యూహంలు, టీమ్‌ ‌వర్కస్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని డీజీపి తెలిపారు. అడవుల సంరక్షణ కు ఇది పునాదిగా నిలుస్తుందన్నారు. ఇదే విధానాలు, నమూనా మిగతా జిల్లాల్లో చేపట్టేలా పోలీస్‌ అధికారులు కృషి చేస్తారని అన్నారు. అటవీశాఖ పీసీసీఎఫ్‌ ఆర్‌.‌శోభ మాట్లాడుతూ….జంగల్‌ ‌బడావో…జంగల్‌ ‌బచావో అనేది ముఖ్యమంత్రి నినాదమన్నారు. అక్టోబర్‌ 7‌న రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్‌, అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి అటవీ సంరక్షణ, పునరుద్ధరణతో ఏయే అంశాలపై సమన్వయంతో కలిసి పనిచేయాలో దిశా నిర్దేశం చేశారన్నారు. అందులో భాగంగానే ఈ రోజు అడవుల పునరుద్ధరణ పనులు గజ్వేల్‌ ‌ప్రాంతంలో సీనియర్‌ ‌పోలీస్‌ అధికారులు పరిశీలించారన్నారు. జంగల్‌ ‌బడావోకు అటవీ శాఖ కృషి చేస్తుందన్నారు. జంగల్‌ ‌బచావోకు పోలీస్‌ అటవీ అధికారులు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలో కలప స్మగ్లింగ్‌కు, వన్య ప్రాణులు సంరక్షణకు పోలీస్‌ అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి , సీపీ జోయల్‌ ‌డేవిస్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply