ఆదివాసిలు చిన్న పెద్దా తేడా లేకుండా సేకరించిన అటవీ ఉత్త్పత్తులను దళారులకు అమ్మి మోసపోకుండా జిసిసి గౌడౌన్లలో అమ్మి ప్రతి ఫలాలు పొందాలని భద్రాచలం ఐటిడిఏ పిఓ గౌతమ్ పోట్రు గిరిజనులకు సూచించారు. మంగళవారం ఆయన మండలంలో ని మారుమూల గిరిజన గ్రామాలైన కొత్తపల్లి, చెరుపల్లి లో ఆకస్మికంగా పర్యటించి ఇప్పపువ్వు సేకరణ గౌడౌన్తో పాటు దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరీశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అడవిలో పకృతి ప్రసాదించే అటవీ ఉత్పత్తులను మద్య దళారులను నమ్మి మోసపోకుండా మీరే స్వయంగా సేకరించి వాటిని జిసిసి గౌడౌన్లలో అమ్ముకోవాలన్నారు. దీని పై జిసిసి వారు సైతం గిరిజనులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
గిరిజనుల నుండి ఇప్పపువ్వు, ధాన్యం కొనుగోలు సమయంలో తప్పకుండా ఎలక్ట్రానిక్ కాటా ఉపయోగించాలన్నారు. తూకంలో లోపాలు ఉంటే చర్యలు తప్పని సరిగా తీసుకుంటామన్నారు. న్యాయమైన పద్దతిలో అటవీ ఉత్తత్తుల ను కొనుగోలు చేసి వారికి సకాలంలో డబ్బులు చెల్లించాల న్నారు. ఆకాల వర్షాల వలను సేకరించిన దాన్యం తడిచి పోయే ప్రమాదం ఉందని సేకరించిన దాన్యాన్ని ఎప్పటికప్పుడు గౌడౌన్లలో నిల్వ చేయాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని జిసిసి అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన కొత్తపల్లి గ్రామంలో ఎంత మంది జనాభా ఉన్నారు, వీరికి రహదారి సౌకర్యం ఉందా, తదితర మౌళిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిసిసి డివిజనల్ మేనేజరు కుంజా వాణి, సొసైటీ చైర్మన్ కుంజా శంకర్, ఆర్ఐ మల్లయ్య, సిసి గణేష్ తదితరులు ఉన్నారు.