Take a fresh look at your lifestyle.

మేడారం కానుకల్లో విదేశీ కరెన్సీ, రద్దైన నోట్లు

Foreign currency and canceled notes in medaram jathara donations
వరంగల్ :– మేడారం జాతర లో భక్తుల కానుకలు కూడా పెద్ద ఎత్తునే వచ్చాయి. ఇంతవరకు చేసిన లెక్కలలో సుమారు ఏడు కోట్ల రూపాయలు రాగా, మరో వారం రోజుల పాటు కానుకల లెక్కింపు జరుగుతుందని సమాచారం. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపం ఈ లెక్కింపు సాగుతోంది. రూపాయి నాణేలు మొదలు రెండు వేల రూపాయల నోట్ల వరకు హుండీల నుంచి పడుతున్నాయి. ఫారిన్‍ కరెన్సీతో పాటు రద్దయిన ఐదువందల రూపాయల నోట్లు కూడా దర్శనమిస్తున్నాయి.
బంగారు కడియాలు, వెండి కడియాలు, కుంకుమ భరిణెలు, వివిధ ప్రతిమలు బయటపడుతున్నాయి. బుధవారం నుంచి లెక్కింపు ప్రారంభమవగా.. శనివారం నాటికి హుండీల నుంచి రూ.7 కోట్ల ఆదాయం ఎండోమెంట్‍ అకౌంట్​లో జమైంది. మరో వారంపాటు లెక్కింపు కొనసాగనుంది. 2018 జాతరలో హుండీల నుంచి రూ.10.70 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply