Take a fresh look at your lifestyle.

అప్పుల బాధ తో యువ రైతు బలవన్మరణం

అప్పుల బాధ భరించలేక మరో రైతు బలవనర్మరణానికి పాల్పడ్డాడు. సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ ‌మండలంలోని లింగారెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం…లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువ రైతు కొత్త కనకయ్య(35)అప్పుల బాధ భరించలేక శనివారం తెల్లవారు జామున తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు కనకయ్యకు భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు తెలుస్తుంది.

మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌కు చెందిన ఓ వడ్డీ వ్యాపరీ వద్ద కనకయ్య కొంత డబ్బును అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. అప్పు ఇచ్చిన సదరు వడ్డీ వ్యాపారీ డబ్బులు చెల్లించాలంటూ గత కొన్ని రోజులుగా అడుగుతుండటంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాకీగా తీసుకున్న డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మనోవేదన చెందిన రైతు కనకయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply