Take a fresh look at your lifestyle.

అనాథ పిల్లలకు చేయూత కోసం ఫోర్స్ ‌తపన

  • సమాజంలోని పేదలతో సమానంగా ఆదుకోవాలి
  • పార్లమెంటు సభ్యులకు గాదె ఇన్నారెడ్డి, ఇంద్రసేనారెడ్డి విజ్ఞప్తి

దేశంలో దిక్కూమొక్కూ లేకుండా ఆదుకునే నాథుడు లేక అల్లాడుతున్న అనాథలకు చేయూతనిచ్చేందుకు ఫోర్స్ ‌సంస్థ తపిస్తోంది. ఈ దేశంలో సుమారు 4 కోట్ల మంది అనాథ పిల్లలను ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులను, స్వచ్చంద సంస్థలను ఈ మహాత్తర కార్యక్రమంలో భాగస్వాములను చేస్తోంది. ఇందులో భాగంగా ఫోర్స్ ‌సంస్థ అధ్యక్షుడు గాదె ఇన్నారెడ్డి, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ‌హనుమకొండ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ‌కాయిత ఇంద్రసేనారెడ్డి దేశ రాజధాని డిల్లీలో పార్లమెంటు సభ్యులను కలుస్తూ అనాథల సమస్లను పార్లమెంటులో ప్రస్తావించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అనాథ పిల్లలు ఎటువంటి చట్టబద్దమైన గుర్తింపు లేకుండా జీవిస్తూ వివిధ ఆశ్రమాలలో, దాతల సహాయ సహకారాలతో విద్యను కొనసాగిస్తున్నారు కానీ, ప్రభుత్వం నుంచి ఏ విధమైన అండదండలు అందడం లేదనీ, అనాథ హక్కుల కోసం భారత పార్లమెంటులో అనాథ అనే పదానికి ఒక నిర్వచనం ఇవ్వాలని గత పది రోజులుగా ఢిల్లీలో ఉంటూ వివిధ రాష్ట్రాల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను అర్థిస్తున్నారు.

ఈ సందర్భంగా పీస్‌ ఆధ్వర్యంలో 25 మంది సభ్యులు మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం పిల్లలు ఢిల్లీలో అనాథలను కూడా దేశ పౌరులుగా గుర్తించాలనీ, వారికి కూడా దేశంలోని ఇతర పౌరులుగా జీవించేలా ప్రభుత్వం సదుపాయాలు కల్పించాలని కేంద్ర మంత్రులకు కూడా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ‌హనుమకొండ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ‌కాయిత ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ అనాథ పిల్లలు చదువుకోవడానికి ఎలాంటి రిజర్వేషన్లు లేవనీ, వీరికి దేశంలోని మిగతా పేద పిల్లలతో సమానంగా రిజర్వేషన్‌ ‌సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనాథలకు కూడా కొంత శాతం రిజర్వేషన్లు ఇచ్చిన పక్షంలో వారి సమస్యలను చట్టసభలలో ప్రస్తావించే అవకాశం ఉంటుందనీ, తద్వారా మరికొంత మంది అనాథల జీవితాలలో వెలుగులు నింపినట్లవుతుందని పేర్కొన్నారు.

అనాథ పిల్లల హక్కుల సాధన కోసం తమ సంస్థ చేస్తున్న పోరాటాలను పార్లమెంటుకు తెలియజేసి సహకరించాలని కోరడంతో పాటు ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి సైతం తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌, ‌డీన్‌ ‌మధుసూధన్‌, ‌సౌజన్య, ఆనంద్‌బాబు, ఇచ్ఛా ఫౌండేషన్‌, ‌రైల్వే నాయకులు కర్ర యాదవరెడ్డి, పిళ్లై ప్రేమ్‌కుమార్‌, ‌విఎవి రమణ లక్ష్మి, ఢిల్లీకి చెందిన సామాజికవేత్త కళా శ్రీనివాస్‌, ‌హర్యానాకు చెందిన సామాజికవేత్త మహేందర్‌ ‌గర్గ్, ఔరంగాబాద్‌కు చెందిన సుభాష్‌ ‌చందు, సామాజికవేత్త సచిన్‌ ‌ఫోర్స్ ‌సభ్యులు పాల్గొన్నారు.

Tags: Professor, Dean Madhusudhan, Saunjaya, Anand Babu, Ichcha Foundation, Railway Leaders Karra Yadavreddy, Pillai Premkumar

Leave a Reply