Take a fresh look at your lifestyle.

మీ కోసం.. మీ ఆరోగ్యం కోసమే… మీ హరీష్‌రావు మన రక్షణ..

  • మన చేతుల్లో.. చేతలలోనే ఉంది
  • ప్రతి ఒక్కరు చేతులు శుభ్రంగా ఉంచుకుందాం..కొరోనాను తరిమేద్దాం
  • సిద్దిపేట పట్టణంలో ప్రతి ఇంటికి శానిటైజర్‌ ‌పంపించిన మంత్రి హరీష్‌రావు
అన్ని వార్డుల్లో ఇంటింటికి పంపిణీ చేసిన వార్డు కౌన్సిలర్స్ , ‌మున్సిపల్‌ అధికారులు, పార్టీ శ్రేణులు
సిద్దిపేట ప్రజలే నా కుటుంబం. నేను మీలో ఒకడిని. వోట్లప్పుడే కాదు .ఎప్పుడు అయినా..ఏ విషయంలోనైనా మీ కష్టసుఖాల్లో మీ సేవలో నేను ఉంటా అనే మాట మంత్రి హరీష్‌ ‌రావు  నోటి నుండి వచ్చే మాట విన్నాం. విన్న మాట ఎంత నిజమో అందుకు రెట్టింపు ఉదాహరణలు ఎన్నో మన ముందు ఉన్నాయ్‌. ‌కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో  మరో సారి ఆ మాటను నిజం చేసుకున్నారు మంత్రి హరీష్‌ ‌రావు .. మీ కుటుంబ సభ్యున్ని..మీలో ఒకడిగా నేను ఉన్న..అందుకే మీ కోసం..మీ ఆరోగ్యం కోసం మీ ఇంటికి సానిటాయిజర్‌ ‌ను పంపిస్తున్నా అని సిద్దిపేట పట్టణంలో దాదాపు 40వేల సానిటాయిజర్‌ ‌లు పంపిణీ చేపట్టి ప్రజలు ఆరోగ్యం పై శ్రద్ధ చూపేల చైతన్యం తెచ్చారు.. మన ఆరోగ్యం..మన రక్షణ ఎక్కడో లేదు మన చేతుల్లో …మన చేతలలో అని.. ప్రతి ఒక్కరు చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అని కరోనాను తరిమి కొట్టాలి అని ఆ సానిటాయిజర్‌ ‌బాటిల్‌ ‌ద్వారా తన సందేశాన్ని ఇచ్చారు..
image.png
మంత్రి హరీష్‌రావు పంపిన శానిటైజర్లు
ఈ సందర్భంగా బుధవారం రోజున పట్టణములో వార్డు కౌన్సిలర్స్ ఆ ‌సానిటాయిజర్‌ ‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మా ఆరోగ్యం పట్ల ప్రజలే నా కుటుంబం అని ఇలాంటి నాయకుడు మాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం అని ఆనందంగా ఉందని పట్టణ ప్రజలు మంత్రి హరీష్‌ ‌రావు  పంపించిన సానిటైజర్‌ ‌పట్ల ఆనందం వ్యక్తం చేసారు.. హరీష్‌ అన్న చెపినట్టు ఇంట్లోనే ఉంటాం..చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటాం అని చెప్పారు…

Leave a Reply