Take a fresh look at your lifestyle.

నిరుద్యోగ రిజిస్టర్‌ ‌కోసం మిస్ట్ ‌కాల్‌ ‌కాంపెయిన్‌ ‌ప్రారంభం

For unemployment register Missed Call Campaign

జాతీయ యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జాతీయ నిరుద్యోగ రిజిస్టర్‌ని నిర్వహించేందుకు మిస్డ్‌కాల్‌ ‌కాంపెయిన్‌నుమంగళవారం ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్‌ ‌నాయకులు బత్తుల ప్రతాప్‌రుద్ర ప్రారంభించారు. ఖమ్మంలోని రేణుకాచౌదరి క్యాంపు కార్యాలయంలో దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులైన నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రధాని మోడీ మాత్రం దేశంలో సిఎఎ, ఎన్‌ఆర్‌సి అంటూ సమస్యలను పక్కదారిపట్టించే ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని గద్దెనెక్కి పట్టుమని పదిలక్షల ఉద్యోగాలను కూడానింపకపోవడమేకాకుండా నిరుద్యోగ సమస్యను పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తమకు ఎన్‌ఆర్‌సి వద్దని, ఎన్‌ఆర్‌యు(జాతీయ నిరుద్యోగ రిజస్టర్‌) ‌కావాలని చేపట్టిన మిస్డ్‌కాల్‌ ‌కాంపెయిన్‌ ‌ఖమ్మం జిల్లాపరిధిలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

పట్టభద్రులైన నిరుద్యోగ యువత 8151994411 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూత్‌కాంగ్రెస్‌ ‌ఖమ్మం నియోకవర్గ జనరల్‌ ‌సెక్రటరీ అబ్దుల్‌ అహ్మద్‌, ‌సంపత•,అజర్‌, ‌వివేక్‌, ‌జాకీర్‌, అబ్బాస్‌ ‌సాయి, నవీన్‌ ‌పాల్గొన్నారు.

Tags: For unemployment register Missed Call Campaign,Abdul Ahmad, General Secretary, Youth Congress Khammam Constituency, Sampath

Leave a Reply