Take a fresh look at your lifestyle.

ప్రజల శ్రేయస్సు కోసం కూతురుకు దూరంగా వైద్యుడు

తాండూరు, మే 1, ప్రజాతంత్ర విలేఖరి : బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య-జయతార దంపతుల కూతురు నిహారిక-మల్లేష్‌ ‌దంపతులకు గత సంవత్సర క్రితం వివాహమైంది. ఏప్రిల్‌ 1‌వ తేదిన దంప తులకు పండండి పాప జన్మించింది. నిహారిక భర్త మల్లేష్‌ ‌మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వైద్యునిగా విధులు నిర్వహిస్తున్నాడు.

ఇదే సమయంలో కరోనా వైరస్‌ ‌ప్రబలుతున్న నేపథ్యంలో అతనికి క్వారంటైన్‌ ఇం‌చార్జీగా అక్కడి ప్రభుత్వం విధులను కేటాయించింది. దీంతో నిహారిక-మల్లేష్‌ ‌దంపతులకు కూతురు జన్మించి నెల రోజులవుతున్నా తండ్రి మల్లేష్‌ ‌కూతురును చూడలేని పరిస్థితి నెలకొంది. కట్టడి కోసం వైద్యులందరూ కృషి చేస్తున్న నేపథ్యంలో మల్లేష్‌ ‌సైతం ఇలా తన వైద్య వృత్తిలో భాగంగా ఇలా విధులు నిర్వహింస్తుండడంతో బంధువులు, కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తూ మరోవైపు కూతురు తన తండ్రి ప్రేమ కోసం ఎదరు చూస్తుందంటూ మాట్లాడుకుంటున్నారు.

Leave a Reply