Take a fresh look at your lifestyle.

వరుసగా రెండో రోజూ.. దేశంలో కొరోనా రోజువారీ కేసుల్లో పెరుగుదల

తాజాగా 24 గంటల్లో 41,195 మందికి పాజిటివ్‌.. 490 ‌మంది మృతి
దేశంలో వరుసగా రెండో రోజూ రోజువారీ కొరోనా కేసుల్లో పెరుగుదల నమోదయింది. తాజాగా 24 గంటల్లో 41,195 మందికి పాజిటివ్‌ ‌నమోదు కాగా 490 మంది వైరస్‌ ‌కారణంగా మృత్యువాత పడ్డారు. జాతీయ స్థాయిలో కోవిడ్‌ ‌వాక్సినేషన్‌ ‌కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 52.36 కోట్ల టీకా డోస్‌లు వేశారు. క్రియాశీల కేసుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. 2020 మార్చి నుంచి చూసినపుడు ఇది కనిష్టం.

ఇండియాలో క్రియాశీ కేసుల సంఖ్య ప్రస్తుతం 3,87,987 గా ఉంది. గరిష్ఠస్థాయిలో 97.45 శాతం రికవరీ రేటు ఉండగా దేశంలో ఇప్పటివరకు 3,12,60,050 మంది కోవిడ్‌ ‌నుంచి కోలుకున్నారు. గత 24 గంటలలో కోవిడ్‌ ‌నుంచి 39,069 మంది కోలుకోగా వారపు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 2.23 శాతం. రోజువారి పాజిటివిటి రేటు 1.94 శాతంతో వరుసగా గత 17 రోజులలో 3 శాతం కంటే తక్కువగా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తంగా 48.73 కోట్ల పరీక్షలు నిర్వహించారు.

Leave a Reply