Take a fresh look at your lifestyle.

ఆదివాసి హక్కుల పరిరక్షణకు జీఓ.నెం.3పై రివ్యూ చేయాలి..

“సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు జరిగితే ఒక లక్ష, యాబైవేల మంది ఆదివాసీ కుటుంబాలు అటవీజీవనానికి దూరంఅయ్యే ప్రమాదం ఉంది.ఉమ్మడి రాష్ట్రంలో ఆదివాసి గిరిజనుల కోసం ,అభ్యున్నతికోసం ప్రభుత్వం గిరిజన   విద్యా వికాస్‌ ‌పాటశాలలు ఏజేన్సీ ప్రాంతాలలో  స్థాపించడం జరిగింది.చదువుకోవాడానికి  ఎవరు ఆసక్తి  చూపిన సందర్బాలు కూడా లేవు, ప్రభుత్వాలు దాదాపుగా నిర్భంద విద్యా అమలు చేసినప్పటికి  ప్రయోజనం కానరాలేదు.”

  • షెడ్యూల్డ్ ‌తెగలకు 100%రిజర్వేషన్లకు ముప్పు,మున్ముందు క్రిమిలేయర్‌ ‌సమస్య
  • ఆంధ్రప్రదేశ్‌, ‌తెలంగాణ ప్రభుత్వాలు కలిసి పోరాడాలి
  • కేంద్ర ప్రభుత్వం చోరవతో ఆదివాసీల హక్కుల భంగం కలగకుండా చూడాలి.

తెలుగురాష్ట్రాలలో జీవించే ఆదివాసీలలో చెంచులు, గోండు,గోత్తికోయ, కోయ,కొండ రెడ్లు, సవరలు,లంబాడా,ఏరుకల వివిధ 33 తెగలలో అత్యధికంగా నిర్లక్షానికి గురైంది చెంచులు అయితే ఈ తెగలలో ఎక్కువగా వేట, అటవీ ఉత్పత్తులసేకరణ ఆదారంగా,కోన్ని తెగలు స్థిరవ్యవసాయ తెగలుగా జీవించడం .ప్రధానంగా లంబాడాలు,ఏరుకలు మైదాన ప్రాంతంలో జీవిస్తున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాలలో ఆదివాసులు వాణిజ్య పంటలు వేసి కోంత లాభాలు ,జీవనం ఆశాజనకగా ఉన్నప్పటికి, వలస దనిక రైతాంగం బాగా పాతుక పోయింది.వారి జీవనశైలిలో మార్పుకూడా వచ్చింది.14వ శతాబ్దం నాటితెలంగాణలోని పెద్ద చెరువులైన లక్నవరం, రామప్ప, పాఖాల వంటి చెరువుల కింద ఉన్న భూములు దాదాపుపూర్తిగా కోస్తా ధనిక రైతుల చేతుల్లోకి వెళ్ళిపోయింది.పోలవరం ప్రాజెక్టుతో ఏడుమండలాల్లో ఆదివాసీల బ్రతుకు చిత్రం చిందరవందర అయ్యింది.విచిత్రంగా వారి సంస్క•తి, భాష, యాసను కోన సాగిస్తున్న కోయజాతి రాను,రాను పూర్తిగా అదృశ్యం అవుతుంది. ఇటీవల సుప్రీంకోర్టు జిఓ,నెం.3పై ఇచ్చిన తీర్పుతో ఉన్న రిజర్వేషన్లకు ముప్పువాటిల్లుతుంది.

భారత రాజ్యంగంలో 1950, 26 జనవరి కంటే ముందు నుండి నివసించిన గిరిజనులను మాత్రంమే స్థానికతగా తీసుకొని, షెడ్యూల్డ్ 5,6 ‌ప్రకారం గవర్నర్‌కు ఉన్న ప్రత్యేకం మైన అధికారంతో, చట్టంతో గిరిజన సంక్షేమకోసం, విద్యావికాసం కోసం గిరిజన విద్యా వంతులుగా తీర్చి దిద్దడంలో క్రీయాశీలక పాత్ర పోషించింది జిఓ.నెం.3ఉద్ద్యేశం ఏజెన్సీలలోగిరిజనుల విద్యా వ్యవస్థను బలోపితం చేసేందుకు అంతాంత మాత్రంగా చదువుకున్న ఉన్నత విద్యా నోచుకోని గిరిజనులకు, ఏజెన్సీలలో అక్కడ ఎవరు పనిచేయని పరిస్థితిలో, గిరిజనులలో 10వ తరగతి, ఆపై తరగతి చదవిన నిరుద్యోగులను విద్యా వాలంటరీలుగా నియమించడం గిరిజనుల యాస,భాషను గిరిజనేతరులను అర్ధం చేసుకోరని అందుకోసం యన్‌ ‌టీ ఆర్‌ఈ ‌జీవోను ప్రవేశపెట్టడం జరిగింది.ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో 1975లో ఉద్యోగాలలో రాష్ట్రపతి ఆమోదంతో చట్టంలో కాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2000‌లో ఏర్పాటు చేసిన జోసల్‌ ‌యన్‌ ‌టీ ఆర్‌ఈ ‌జీవోను ప్రవేశపెట్టడం జరిగింది.ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో 1975లో ఉద్యోగాలలో రాష్ట్రపతి ఆమోదంతో చట్టంలో కాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2000‌లో ఏర్పాటు చేసిన జోసల్‌వ్యవస్థకు కూడా ఎక్కడ వ్యతిరేకంగా లేదు,అయినప్పటికి ఏ జిల్లాకు ఆజిల్లా యూనిట్‌గా తీసుకునిస్థానకతకు ఎక్కడ బంగం వాటిల్లకుండా చూడడం జరిగింది. భారతదేశంలో షెడ్యూల్డ్ ‌తెగలు 744 ఉన్నాయి, అందులో అంప్రదేశ్‌లో 26 తెగలు , తెలంగాణలో 32 తెగలు ఉన్నాయి. ఫీసా చట్టంలో పొందుపర్చిన స్వయంపాలన. భూమి, రాజకీయాలలో, విద్యా, ఉద్యోగం గిరిజనులలో 100%శాతం రిజర్వేషన్లు కలిపించాలని స్థానికంగా కంటిన్యూగా నాలుగు సంవత్సారాలు చదివిన, లేదా ఏడూ సంవత్సరాలు కంటీన్యూగా నివాసం ఉన్న వాండ్ల అందరికి వర్తించే విధంగా చట్టం రూపోందించడం ఆదివాసీల అభ్యున్నతికి దోహద పడిందనడంలో ఏలాంటి అతిశయోక్తి లేదు.ఆదివాసీల అన్యాక్రాంతమైన భూములు వారికి దక్కేలా చేసేందుకు 1959 భూమి బదలాయింపు చట్టము , 1ఆఫ్‌ 70 ‌భూపరాయికరణ నిషేధ చట్టం ఉన్నప్పటికి, ప్రధాన చట్టం 1/59 భూములకు రక్షణకు దోహదపడుతుంటే 1/70 నిబంధన గిరిజనేతరుల ఆస్తులు క్రయ, విక్రయాలపై కఠినమైన ఆంక్షలను తెలుపుచున్నప్పటికి, ప్రభుత్వాలు నిషేధము కోనసాగించినప్పటికి, గిరిజనేతరుడు అమ్మినా,కౌలుకు ఇచ్చినా అద్దెకు ఇచ్చినా గిరిజనుడికే బదలి చేయాలన్న ఈ చట్టం ఖచ్చితంగా అమలుపరచాలని ,సాగుభూములు, పోరంబోకు, అటవి సంంపద ఆదివాసులకు చెందేవిదంగా చట్టం ఉన్నకూడా ఆత్మగౌరవ పోరాటాలు,అస్థిత్వం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి దాపరించింది.

తెలుగు రాష్ట్రాలలో 2006 అటవి చట్టంను పూర్తి స్థాయిలో బదలాయించలేదు.కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం తెలంగాణలో ఇప్పటి వరకు 31వేల మంది ఆదివాసులకు105590 ఎకరాలు కేటాయించినట్లు గణాంకాలు చెప్పుచున్నాయి.పట్టాలు ఉన్న ప్రతిరైతుకు రైతుబందుతో పాటు, రైతుబీమా వర్తిస్తుంది. భూమి హక్కులకోసం ఆర్జీలుపెట్టుకున్న వారిలో 44%శాతం తెలంగాణలో,42% శాతం ఆంధ్రప్రదేశ్‌ ‌లో తిరస్కరణ గురికావడం, సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు జరిగితే ఒక లక్ష, యాబైవేల మంది ఆదివాసీ కుటుంబాలు అటవీజీవనానికి దూరంఅయ్యే ప్రమాదం ఉంది.ఉమ్మడి రాష్ట్రంలో ఆదివాసి గిరిజనుల కోసం ,అభ్యున్నతికోసం ప్రభుత్వం గిరిజన విద్యా వికాస్‌ ‌పాటశాలలు ఏజేన్సీ ప్రాంతాలలో స్థాపించడం జరిగింది.చదువుకోవాడానికి ఎవరు ఆసక్తి చూపిన సందర్బాలు కూడా లేవు, ప్రభుత్వాలు దాదాపుగా నిర్భంద విద్యా అమలు చేసినప్పటికి ప్రయోజనం కానరాలేదు,తెలంగాణ ఎర్పడక ముందు 96 స్కూల్స్ ఉం‌టే తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డా తర్వాత ప్రభుత్వంగిరిజనుల కోసం అదనంగా 73 గురుకు) పాఠశాలలు ప్రారంబించడం జరిగింది, మొత్తం 169 గిరిజన గురుకు) పాఠశాలలు అదేవిధంగా అన్నిసదుపాయాలతో కూడిన కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ఏకలవ్య స్కూల్స్ ‌గతంలో 9 ఏర్పాటు చేయగా 2020-21 విద్యాసంవత్సరానికి తెలగాణ ప్రభుత్వం చోరవతోమరో 7 ఏకలవ్య స్కూల్స్ ఇటీవలనే ప్రారంబించడం జరిగింది.ఇప్పుడిప్పుడే ఉన్నత విద్యాలో పట్టు సాదిస్తున్న గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లి బ్రతుకు జీవనంలో మార్పురావడం, జీఓ.నెం 3 గుదిబండలా మారింది.ఆదేశాలు అమలు జరిగితే రానున్న రోజులలో•ఎ,బి,సి,డివర్గీకరణ చేయకుండానే, ఆదివాసులలోని సంపన్నులను గుర్తించి వారి, ఆదాయం,వనరుల ఆదారంగా బి.సీలను ఆవేదనకు గురిచేస్తున్న క్రిమిలేయర్‌ ‌గిరిజనులకు వర్తింప చేసే అవకాశం లేకపోలేదు అని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. జీఓ.నెం 3పై ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి రిజర్వేషన్లు షెడ్యూల్‌ ‌ప్రాంత వాసులకు ప్రత్యేకంగా కల్పించిన భూమి, విద్యా, ఉద్యోగం 100% శాతంస్థానిక గిరిజనులకే చెందాలని ,ప్రభుత్వం కట్టుబడి వుందని ,సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన జీఓ.3తోగిరిజనులకు నష్టం జరుగుతుందని ,తదుపరి తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలను తీసుకోవాడానికి, న్యాయసలహలతో రివ్యూ పిటీషన్‌ ‌వేస్తున్నామని తెలపిన విషయాన్నిమేధావులు స్వాగతించాలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ.నెం 3పై అప్పీల్‌ ‌చేస్తుందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌ప్రకటిచడం హర్షనీయమే..గిరిజనులకు 10% శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్‌ ‌ప్రకటించిన సంగతి విదితమే,ఏదీ ఏమైనా కేంద్ర ప్రభుత్వం చోరవతో జీఓ.నెం 3పై స్పందించి గిరిజనులకు సంబందించిన చెందాల్సిన షెడ్యూల్‌ 5,‌ప్రకారం 100% రిజర్వేషన్ల పై ఒక ఆర్డినేన్స్ ‌తీసుకరావాలని, మేధావులు కోరుచున్నారు.

sangani malleswaram
డా।। సంగని మల్లేశ్వర్‌
‌జర్నలిజం విభాగాధిపతి, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌, 9866255355

 

Leave a Reply