Take a fresh look at your lifestyle.

పీఆర్‌సీ కోసం..13న చలో అసెంబ్లీ

  • ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక
  •  సీఎస్‌కు నోటీస్‌ ..
  • 4,5 ‌తేదీల్లో ఎంఎల్‌సీ నర్సిరెడ్డి నిరాహార దీక్ష 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు,.ఈ నెల 13న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని ఉద్యోగుపాధ్యాయసంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. . జూన్‌-2018 ‌నుంచి అమలు చేయాల్సిన పీఆర్‌సీపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం, కనీసం మధ్యంతరభృతికూడా ప్రకటించకపోవడం, వంటి దీర్ఘకాలిక సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉద్యోగులు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. తమ సమస్యలప్నింటికీ ఏకరువు పెడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు,ఉపాధ్యాయులు,, పెన్షనర్లు, పబ్లిక్‌సెక్టార్‌ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యవేదిక సారథ్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి విజ్ఞాపన అందజేశారు.పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికను తెప్పించుకొని వెంటనే అమలుచేయాలని, సీపీఎస్‌ ‌రద్దు చేసి, పాతపెన్షన్‌ ‌విధానాన్ని, పునరుద్ధరించాలని,

కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమానపనికి, సమానవేతనం వర్తింపచేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ ‌చేయాలని వంటి డిమాండ్‌లన్నింటినీ ఏకరవు పెడుతూ య ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులు చావారవి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. సోదర ఉద్యోగు ఉపాధ్యాయ సంఘాలన్నింటిన్నింటితో సంప్రదింపులు జరిపామని, వారికి ఉన్న పరిమితుల దృష్ట్యా క్షేత్రస్థాయి ఉద్యమాలకు కదిలి రావడంలేదని, సూత్రప్రాయంగా ఈ డిమాండ్‌లన్నింటితో అన్నీ సంఘాలు ఏకీభవిస్తున్నాయని సంఘం బాధ్యులు చావారవి పేర్కొన్నారు. అయితే 2018 జూన్‌ 2‌న మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇస్తామని, 2018 ఆగస్టు 15 నాటికి పీఆర్‌సీ ప్రకటిస్తామని ప్రభుత్వ పెద్దలు అప్పట్లో హామీ ఇచ్చారు.సారాంశంలో ఈ హామీలు రాకపోగా, పీఆర్సీ గడువును మూడు మాసాల కాలం నుంచి ముప్పైనెలలకు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం 27 శాతం తాత్కాలిక భృతిని ప్రకటించింది.సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చి నాలుగేళ్లు గడిచిపోయింది.

రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ ‌చేస్తామని, రాష్ట్రంలో కాంట్రాక్ట్ ‌వ్యవస్థనే రద్దు చేస్తామని సీఎం ఉద్యమ సందర్భంలో చాలాసార్లు హామీలు ఇచ్చారు.అదేవిధంగా పాతపెన్షన్‌ ‌విధానాన్ని పునరుద్ధరిస్తామని, కేంద్రంతో ఏ పార్టీ అధికారొస్త్రంలో ఉన్నా, ఆ అధికారపార్టీని ఒప్పించి సీసీఎస్‌ ‌విధానాన్ని రద్దు చేసేవిధంగా కృషి చేస్తామని తెలంగాణ పెద్దలు హామీలు ఇచ్చారు.ఉపాధ్యాయుల పదోన్నతులు, పండితులు, పీఈటీల అప్‌‌గ్రేడేషన్‌,‌కారుణ్యనియామకాల భర్తీలు,ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులందరినీ తెలంగాణకు తీసుకరావడం,భార్యాభర్తలను ఒకేచోటకు బదిలీ చేయడం వంటి అనేక ఉద్యోగుల సమస్యలపైన రెండేళ్లక్రితం సానుకూలంగా స్పందించిన సీఎం ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపలేదని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆవేదన.ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు ఉపాధ్యాయులు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, సీపీఎస్‌ ఉద్యోగులు ప్రభుత్వ వైఖరిపైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సమస్యలన్నింటిపైన నిరసనోద్యమాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్‌సెక్యాటర్‌, ‌కాంట్రాక్ట్ ఉద్యోగసంఘాల ఐక్యవేదిక కార్యాచరణను ప్రకటించింది. ఈ ఐక్యవేదిక రూపొందించిన కార్యాచరణలో పాల్గొనేందుకు, ఎస్‌టీయూటిఎస్‌, ‌టీఎస్‌యూటిఎఫ్‌,‌డీటీఎఫ్‌,‌టీఎన్‌టీఎన్జ్‌వో,సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఈ కార్యాచరణలో భాగంగానే ఈ ల13న చలోఅసెంబ్లీ నిర్వహించనున్నట్లు స్పష్టంచేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి మే 2018లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాల్సిందేనని ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. కాగా శాసనమండలి సభ్యులు నర్సిరెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 4,5 తేదీలలో నిరాహార చేస్తానని కార్యాచరణ ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల ఉపాధ్యాయులు పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు సీపీఎస్‌ ఉద్యోగుల సమస్యలన్నింటినీ ప్రభుత్వం వాయిదావేస్తున్నదని, కాలాయాపనతోనే సమయం గడుపుతున్నారని, శాసనమండలి సభ్యులు ఆరోపించారు..అదేవిధంగా ఈ నెల 9, 10 తేదీలలో నిరసన దీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇందిరాపార్క్ ‌వేదికగా నిరసనలను కొనసాగిస్తామని ఐక్యవేదిక తెలియచేసింది. ఉద్యోగ ఉపాధ్యాయ సర్వీసు నిబంధనలపైన పదోన్నతులపైన చర్యలు తీసుకోవాలని, కచ్చితమైన వైఖరిని నిర్ణయించాలని ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. టీఎస్‌యూటిఎఫ్‌ అధ్యక్షులు కేజంగయ్య, ప్రధానకార్యదర్శి చావారవి, టీపీటీఎఫ్‌ ‌నాయకులు కే.రమణ, మైస శ్రీనివాస్‌, ‌డీటీఎఫ్‌ ‌టీ.లింగారెడ్డి, టీపీటీయూ ఎం.రాధాకృష్ణ ఎస్‌టటీఎఫ్‌ ‌నాయకులు యూ,పోచయ్య, రాష్ట్ర పింఛన్‌దారుల సంఘం నాయకులు రాజేంద్రబాబు తదితరులు ఈ కార్యాచరణలో పాల్గొంటున్నారు.కాగా కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, ‌కేరళ రాష్ట్రాలకన్నా మనరాష్ట్రంలోష్ట్రంలో జీతాలు తక్కువగా ఉన్నప్పటికీ, మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరమని ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు.

Leave a Reply