లాలాగూడ లా అండ్ ఆర్డర్ బాధ్యతలు స్వీకరించిన మధులత
ప్రజాతంత్ర , హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఓ మహిళా పోలీసు అధికారికి అరుదైన గౌరవం కల్పించింది. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో తొలిసారిగా మహిళా పోలీసు అధికారిణికి ఎస్‌హెచ్‌వో హోదా కల్పించి గౌరవించింది. నగరంలోని లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా మంగళవారం మహిళా ఇన్స్‌పెక్టర్ అధికారి మధులత బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సమక్షంలో మధులత లాలాగూడ లా అండ్ ఆర్డర్ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, హైదరాబాద్ నగర చరిత్రలో తొలిసారిగా లాలాగూడ ఎస్‌హచ్‌వోగా మధులత బాధ్యతలు స్వీకరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.