Take a fresh look at your lifestyle.

నవ్యభారత నిర్మాణానికి.. మాతృభాష పునాది కావాలి

  • అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, గేయ రచయితలు జొన్నవిత్తుల, సుద్దాల అశోక్‌ ‌తేజ

నవ్యభారత నిర్మాణానికి మాతృభాషే పునాది కావాలని గౌరవ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ఇందు కోసం ముందు ప్రాథమిక స్థాయిలో బోధనా మాధ్యమంగా అమ్మ భాషకు పెద్ద పీట వేయాలని సూచించారు. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధనతో మొదలు పెట్టి, పరిపాలనా భాషగా, కోర్టుల భాషగా, ఉన్నత విద్యలైన ఇంజనీరిం గ్‌, ‌మెడికల్‌ ‌శిక్షణలో మాతృభాష ప్రాధాన్యం పెంచాలని సూచిం చారు. దానితో పాటు ఇంట్లో అందరూ మాతృభాషలోనే మాట్లాడు కోవాలని ఆకాంక్షించారు. మాతృభాషలో మాట్లాడడం అంటే ఇతర భాషలను ద్వేషించడం కాదని, అవసరానికి తగినట్టుగా అనేక భాషలు నేర్చుకోవాలని, అదే సమయంలో అమ్మ భాషలో నైపుణ్యం సాధించాలని దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ ‌ముచ్చింతల్‌ ‌స్వర్ణభారత్‌ ‌ట్రస్ట్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. భాష కేవలం మాట్లాడుకోవడం కోసమే కాదన్న ఆయన బాధ కలిగినప్పుడు నిద్రలో సైతం మనం మాతృభాషను పలుకుతామని, మనమెవరమనే రేపటి తరాల ప్రశ్నకు మన గతాన్ని, మన గమనాన్ని తెలియజేస్తూ మాతృభాషే సమాధానం చూపిస్తుందని తెలిపారు. ఒక మహత్తర భాషకు వారసుణ్ని అని చెప్పుకోవడానికి మించిన గర్వకారణం ఏముంటుందన్న ఉపరాష్ట్రపతి,  భాష మన సంస్కృతికి జీవనాడి అని, ఉన్నతమైన సంస్కృతి, ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తుందని తెలిపారు. భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతమౌతాయని పేర్కొన్నారు.

Leave a Reply