Take a fresh look at your lifestyle.

సుస్థిర అభివృద్ధి కోసం.. ప్రతి ప్రయత్నాన్ని భారత్‌ ‌బలపరుస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ

సుస్థిర అభివృద్ధి కోసం ఏ ప్రయత్నాన్నయినా భారతదేశం ఎల్లప్పుడూ బలపరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులను ఎదుర్కునడంలో భారతదేశాన్ని కీలక భాగస్వామిగా యూరోపియన్‌ ‌కమిషన్‌ ‌ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్‌ ‌డెర్‌ ‌లేయెన్‌ అభివర్ణించిన అనంతరం  ప్రధాని మోడీ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాతావరణాన్ని ఎదుర్కునడంలో భారత్‌ ‌కీలక భాగస్వామి అని, ప్రధాని మోదీ నాయకత్వాన్ని తాను ఎంతో అభినందిస్తున్నానని యూరోపియన్‌ ‌కమిషన్‌ ‌ప్రెసిడెంట్‌ ‌లేయన్‌ ‌సోమవారం చేసిన ట్వీట్‌కు స్పందనగా మోదీ ట్వీట్‌ ‌చేస్తూ, ‘‘రోమ్‌లో చాలా ఫలవంతమైన పరస్పర చర్య తర్వాత గ్లాస్గోలో మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.

నిన్న నా ప్రసంగంలో నేను హైలైట్‌ ‌చేసినట్లుగా, సుస్థిర అభివృద్ధి కోసం జరిగే ప్రతి ప్రయత్నాన్ని భారతదేశం ఎల్లప్పుడూ బలపరుస్తుంది. 2070 నాటికి భారతదేశం నికర-సున్నా కర్బన ఉద్గారాలను సాధిస్తుంది’ అని ప్రకటించారు. అదే సందర్భంలో పారిస్‌ ఒప్పందం ప్రకారం వాతావరణ మార్పులను ఎదుర్కువడంలో కట్టుబాట్లను ‘‘అక్షరం మరియు స్ఫూర్తితో’’ తెలియజేస్తున్న ఏకైక దేశం తమదేనని నొక్కి చెప్పారు. వాతావరణ మార్పులపై పోరాటంలో భారత్‌ ‌తీవ్రంగా కృషి చేస్తుందని, అది ఫలితాలు కూడా చూపుతుందని అన్నారు. భారతదేశం తన విధానాలలో వాతావరణ మార్పులను కేంద్రంగా ఉంచుతుందని, రాబోయే తరానికి ఈ సమస్యలపై అవగాహన కల్పించడానికి పాఠశాల సిలబస్‌లో వాతావరణ అనుకూల విధానాలను చేర్చాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా మోడీ నొక్కి చెప్పారు. అక్టోబర్‌ 29‌న  యూరోపియన్‌ ‌యూనియన్‌ అ‌గ్ర నేతలతో జరిగిన సమావేశంలో, వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాలు, వాతావరణ మార్పులు, కోవిడ్‌-19, ‌ప్రపంచ మరియు ప్రాంతీయ పరిణామాలపై మోడీ విస్తృతంగా చర్చించారు.

Leave a Reply