Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ కార్మికులకు సమ్మెకాలం జీతాలు

  • రూ. 235 కోట్లు విడుదల చేసిన ఆర్థికశాఖ
  • లాభాల బాటల్లోకి తెచ్చేలా కార్మికులు పనిచేయాలి: మంత్రి పువ్వాడ

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్టీసీకి.. ప్రభుత్వం బ్జడెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ ‌వయస్సు 60 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కాగా, సీఎం.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారినికై బోర్డు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో వెల్లడించిన విషయం తెలిసిందే.

- Advertisement -

సమ్మె సందర్భంగా చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయడంతో పాటు, వారి డ్యూటీ రాత్రి 8 గంటల వరకు ముగిసేలా చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హా నెరవేరిందని మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌ అన్నారు.

అసెబ్లఅఈ డియా పాయింట్‌ ‌వద్ద ఎ మ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలసి ఆయన డియాతో మాట్లాడారు. సమ్మె కాలానికి సంబంధించిన జీతభత్యాలు చెల్లించేందుకుగానూ 235 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఒకే దఫాలో విడుదల చేసిందన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆర్టీసీ సిబ్బంది ఖాతాల్లో జీతాలు జమ అవుతాయని మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌ అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌ ‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కార్మికులు ఆర్టీసీని లాభాల్లోకి తీసుకుని వచ్చేలా కృషి చేయాలన్నారు. కార్మికులు కష్టపడి పనిచేస్తే లాభాల్లోకి తీసుకుని రావచ్చన్నారు.

Leave a Reply