Take a fresh look at your lifestyle.

ఇక పై గంటకు అయిదు వందల మంది భక్తులకు మాత్రమే శ్రీ వారి దర్శనం టీటీడి కసరత్తు..

లాక్ డౌన్ ఎత్తి వేత తర్వాత దర్శనాల అనుమతి పై కసరత్తు పూర్తి చేసిన టిటిడి ..ప్రతి రోజు 14 గంటల పాటు భక్తులును దర్శనానికి అనుమతించనున్న తెలుస్తుంది. గంటకి 5 వందల మంది భక్తులును మాత్రమే దర్శనానికి అనుమతించి..  మొదటి మూడు రోజుల పాటు టిటిడి ఉద్యోగులును అనుమతించేలా ఏర్పాట్లు చేస్తునట్లు సమాచారం.అటు తరువాత తిరుమల, తిరుపతిలో వున్న స్థానికులు ను ప్రయోగాత్మకంగా 15 రోజులు పాటు అనుమతించే యోచనలో టిటిడి ..రోజుకి 7 వేల మందికి పరిమితం  చేసి ఆన్ లైన్ లో స్లాట్ ద్వారా టిక్కేట్లును బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తునట్లు.. మొదట సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును భక్తులుకు అందుబాటులో వుంచనున్న సమాచారం.టిక్కేట్లును పోందిన భక్తులును మాత్రమే అలిపిరి వద్ద అనుమతించేలా ఏర్పాట్లు చేసి..
ప్రయోగాత్మక పరిశిలన పూర్తి అయిన తరువాత అంచెలు వారిగా చిత్తూరు జిల్లా వాసులు… అటు రాష్ర్ట వ్యాప్తంగా భక్తులును అనుమతించాలని  టిటిడి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. వసతి గదులును ఇద్దరికి మాత్రమే పరిమితం చేసి..అలిపిరి, నడకమార్గంలోనే భక్తులును క్షుణంగా తనిఖి చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. కరోనా వైరస్ నుంచి పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత అందరిని దర్శనానికి అనుమతించే యోచనలో టిటిడి ఉంది.

Leave a Reply