Take a fresh look at your lifestyle.

భారత్‌లో సగం జనాభాకు.. ఆర్థిక ముప్పు

  • వారిని ఆదుకోవడానికి ప్రస్తుత ఉద్దీపనలు పనిచేయవు
  • కొరోనాతో కుదేలైన జాబితాలో అగ్రభాగంలో : ఆర్థిక నిపుణుల అంచనా

కొరోనాతో భారత్‌ ‌లాంటి దేశాల్లో 50 శాతం మంది జనాభా దారద్రంలోకి దిగజరుతారని అంచనా. వారిని ఆదుకునేందుకు ప్రస్తుత ఉద్దీపనలు పనిచేయవని వివిధ సంస్థలు అంచనా వేస్తున్నాయి. గత అయిదారేళ్లుగా ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రపంచీకరణపై పునరాలోచన ప్రారంభమైంది. ఇన్నాళ్లూ ఆవిధానంతో లాభపడిన అమెరికాయే డోనాల్డ్ ‌ట్రంప్‌ ఏలుబడిలో స్వరం మార్చి ఆత్మరక్షణ విధానాలు అమలు చేయడం మొదలుపెట్టింది. కానీ ఇప్పుడంతా మారింది. కొరోనా పెను విపత్తు నుంచి బయట పడాలంటే ప్రపంచ దేశాలన్నిటి మధ్యా పరస్పర సహకారం ఎంతో అవసరం. అమెరికా కూడా ఇందుకు మినహాయింపు కాదు. కొరోనా వల్ల కుదేలైన దేశాల జాబితాలో అది అగ్రభాగాన వుంటుందని ఆర్థిక నిపుణుల అంచనా. కొరోనా మహమ్మారి సమయంలో కూడా భారత్‌ ఏ‌ప్రిల్‌-‌జూలై మధ్య 2,000 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించగలిగిందని, అమెరికా నుంచి ఇప్పటికే మరో 4,000 డాలర్ల మేర పెట్టుబడులకు వాగ్దానాలొచ్చాయని మోదీ చెబుతున్నారు. ఇవన్నీ ఫలప్రదమైతే ఉపాధి అవకాశాలు మెరుగుపడి ప్రజల్లో కొనుగోలు శక్తి పుంజుకునే అవకాశం వుంటుంది. అయితే కొరోనా మహమ్మారికి ముందు నుంచే మన దేశంలో ఆర్థిక మం• •గమనం ఛాయలు కనబడటం మొదలైంది. ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు పోయాయి. వైరస్‌ను నియంత్రించే వరకూ ఎలాగోలా నెట్టుకురావడం కోసమని 2 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించి అమలు చేస్తున్నా దాని వల్ల ఆశించిన ఫలితాలు రాలేదు. లాక్‌డౌన్‌లు సడలించాక అనేక రాష్ట్రాల్లో, నగరాల్లో కొరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చడం మొదలు పెట్టింది. వివిధ రాష్ట్రాలు స్థానిక సంస్థలు ఆర్థిక సాయం కోసం అర్రులు చాస్తున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒత్తిళ్లలో పడింది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు దాదాపుగా స్తంభి ంచిపో యాయి. మున్ముందు నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా వుండొచ్చు. లాక్‌డౌన్‌లు తొలగించిన చోట డిమాండు పెరిగిన సూచనలు కనబడు తున్నాయని సంబరపడు తున్నవా రున్నారు. కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఫలించిందనడానికి దాన్ని ఉదాహరణగా చూపుతున్న వారున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇది నిలకడగా కొనసాగినప్పుడే మనం ఎంతో కొంత ఆశ పెట్టుకోవచ్చు.

ఈఎంఐల చెల్లింపుపై బ్యాంకులు విధించిన ఆర్నెల్ల కాల పరిమితి వచ్చే నెలతో ముగుస్తుంది. ఆ తర్వాత ఎవరెంతవరకూ చెల్లించగలరన్నది అనుమానమే. ఆ రుణాల్లో ఎంత భాగం వెనక్కొస్తాయన్నది ప్రశ్నార్థకం. ఆ మేరకు బ్యాంకుల ఎన్‌పీఏలు పెరుగుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ కేవలం 1.9 శాతానికే పరిమితమవుతుందని ఐఎంఎఫ్‌ ‌తెలిపింది. అదే వాస్తవమైతే 1979 తర్వాత మన దేశ ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో దిగజారడం ఇదే తొలి సారవుతుంది. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడితే దాని దుష్పరి ణామాలు అసాధారణ స్థాయిలో వుంటాయి. ఒక అంచనా ప్రకారం దేశంలో సగం జనాభా పేదరికంలో కూరుకుపోవచ్చు. ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక మన ఆర్థిక వ్యవస్థ సాధించినదంతా ఆవిరైపోవచ్చు. పరిస్థితి ఇంత ప్రమాదకరంగా వున్నది గనుకే ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని అమెరికాలోని మదుపుదార్లకు పిలుపునిచ్చారు. భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి సమయమని కూడా ఆయన సూచించారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతోపాటు మన ఆర్థిక వ్యవస్థ కూడా ఒడిదుడుకుల్లో పడొచ్చునని కీడు శంకించిన ఐఎంఎఫ్‌ ‌సంస్థే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ‌కూడా ఒకటని తెలిపింది. కనుక సమర్థవంతంగా వ్యవహరిస్తే, సకాలంలో సానుకూల చర్యలు తీసుకోగలిగితే ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కడం కష్టం కాదని అనుకోవచ్చు. ఈయూ ఆవిర్భవించాక ఈ స్థాయి పెను సంక్షోభాన్ని ఎదుర్కొనడం ఆ సంస్థకు ఇదే ప్రథమం. ఆ మహమ్మారి సాగించిన విధ్వంసాన్ని చూసి నీరుగారిపోవడం కాక, దాన్నొక సవాలుగా తీసుకుని పునర్నిర్మాణానికి సిద్ధపడటం ఇప్పటి అవసరం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా వస్తే మన ఆర్థిక వ్యవస్థ మళ్లీ వేగం పుంజుకోవడానికి అవకాశం వుంటుందన్నది కేంద్రం అంచనా.

Leave a Reply