Take a fresh look at your lifestyle.

స్వేచ్ఛ కోసం..!!

తుపాకులు కూడా తుళ్లిపడ్డాయి
ఆ మారణకాండ చూసి!
అమాయకుల్ని చంపొద్దంటూ
సైనికుల వేళ్ళు పట్టుకొని ప్రాధేయపడ్డాయి
తెల్లతోలు ఆజ్ఞాపిస్తే నల్లతోలు
నౌకర్లు నరహంతకులై చెలరేగారు..
రౌలత్‌ ‌చట్టాన్ని దొరల దోపిడీ
పాలనని నిరసిస్తున్న ఉపన్యాసాలు
వింటున్న వేలాది భారతీయులపై
దయలేని డయ్యర్‌ ‌దారుణంగా
దాడి చేశాడు
మనుషుల్ని చెట్టుపై పిట్టల్ని కాల్చినట్టు
వేటాడేడు..
బుల్లెట్లు మెరుపులా వచ్చి వొంట్లోకి
దిగబడుతోంటే తల్లులు పిల్లలు
విలపించి విలపించి ఆ మట్టిలోనే
కల్సిపోయేరు
భారతమాత శోకమాత అయి రక్తం
కురిసిన జలియన్‌ ‌వాలా బాగ్‌ ‌లో
పిచ్చిదై విలపించింది
గుండెలేని మొండి మనుషులు పేల్చిన
తూటాలు బండబారిన గోడల్లో అక్కడ
నేటికీ సజీవ సాక్ష్యాలుగా
కన్నీరొలికిస్తుంటే..ఆ దేశభక్తుల
వీరతర్పణం విలువ త్రివర్ణ పతాకమై
అమర స్తూపంపైన రెపరెపలాడుతోంది..
(జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌దౌష్ట్యానికి
102 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా )

– భీమవరపు పురుషోత్తం
9949800253

Leave a Reply