Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడికి కేంద్ర చర్యలకు మద్దతు

  • ఎలాంటి చర్యలకైనా కాంగ్రెస్‌ ఆమోదం
  • ప్రధాని మోడీకి లేఖ రాసిన సోనియాగాంధీ
  • ఆర్థిక ప్యాకేజీని స్వాగతించిన రాహుల్‌

‌కరోనా వైరస్‌ ‌కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంసించారు. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ ‌నిర్ణయాన్ని ఆమె అభినందించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా.. కాంగ్రెస్‌ ‌పార్టీ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి సోనియా గాంధీ గురువారం లేఖ రాశారు. ’కరోనా నివారణకు రు తీసుకున్న 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ‌స్వాగతిస్తున్నాం. ఈ మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా చెబుతున్నా’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా సోనియా గత నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రధానికి రెండు లేఖలు రాయడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సోనియా కొన్ని సూచనలు చేశారు. ప్రజలను కాపాడేందుకు వైద్యులు కృషి చేస్తున్న వైద్యుల వ్యక్తిగత రక్షణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆస్పత్రులు, ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌యూనిట్లు, వెంటిలేటర్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలతో ప్రత్యేకమైన వెబ్‌ ‌పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ సూచించారు.

కరోనా వైరస్‌ ‌నేపథ్యంలో అన్ని ఈఎంఐ చెల్లింపులను ఆరు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. ఈ కాలంలో బ్యాంకులు వసూలు చేయాల్సిన వడ్డీని కూడా మాఫీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. దీనితోపాటు రోజువారీ కూలీలు, ఉపాధి హా కులీలు, భవన నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, వ్యవసాయ కూలీలతోపాట సమాజంలోని ఇతర బలహీన వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీతో సహా విస్తృత ఆధారిత సామాజిక రక్షణ చర్యలను చేపట్టాలని ఆమె ప్రధానిని కోరారు. అవసరమైన పన్ను మినహాయింపులతో సమగ్ర రంగాల వారీగా ఉపశమన ప్యాకేజీని కూడా ప్రకటించాలని సోనియా గాంధీ ప్రధానికి సూచించారు. ఇదిలావుంటే సరైన దిశలో కేంద్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసిందని కాంగ్రెస్‌ ‌నాయకుడు,ఎంపి రాహుల్‌గాంధీ అన్నారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో బాధిత ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌నేడు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. బడుగు, బలహీన వర్గాల సహాయార్థం రూ.1,70,000 కోట్ల ప్యాకేజీని సీతారామన్‌ ‌ప్రకటించారు. లాక్‌డైన్‌ ‌నేపథ్యంలో బాధలకు, ఇబ్బందులకు గురౌతున్న రైతులకు, రోజూవారి వేతన జీవులకు, కూలీలకు, మహిళలు, వృద్ధులకు భారత్‌ ‌రుణపడి ఉందన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply