Take a fresh look at your lifestyle.

కొరోనా చికిత్సకు.. మందుల కొరత రావద్దు

  • అక్రమంగా మందులు అమ్ముతున్న వారి పట్టివేత
  • డీలర్లు, ఔషధ తయారీదారులకు మంత్రి ఈటల సూచన

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో మందుల కొరత రాకుండా చూడాలని, బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మందుల కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన శనివారం తన కార్యాలయంలో సక్షనిర్వహించారు. ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొరోనా చికిత్సకు సంబంధించిన ఔషధాల సరఫరాపై చర్చించారు. కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే అజిత్రోమైసిన్‌, ‌డాక్సీసైక్లిన్‌, ‌డాక్సామెతాసోన్‌, ‌మిథైల్‌ ‌ప్రెడ్నిసోలొన్‌ ‌మందులను వీలైనంత తొందరగా సరఫరా చేయాలని సూచించారు. విటమిన్‌-‌డీ, సీ, మల్టీవిటమిన్‌, ‌జింక్‌ ‌వంటి ఔషధాలను మందుల దుకాణాలు, దవాఖానల్లో సరిపడినన్ని ఉంచాలని చెప్పారు. అలాగే ఎక్కడా మందుల కొరత రాకుండా చూసుకోవాలన్నారు. బ్లాక్‌మార్కెట్లో ఔషధాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇదిలావుంటే కోవిడ్‌ ‌రోగుల వద్ద కొట్టేసిన ఇంజెక్షన్లు, మందులను కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ మెడికల్‌ ‌దుకాణం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. దుకాణదారుడితో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని మెహదీపట్నంలో చోటుచేసుకుంది. మెహదీపట్నం ప్రాంతంలోని ఆలివ్‌ అనే ప్రైవేట్‌ ఆసుపత్రిలో వార్డ్ ‌బాయ్‌ ‌గా పనిచేస్తున్న రవి రాజు, అజిస్‌ అదేవిధంగా సరా అనే ఆస్పత్రిలో పనిచేసే ఒబేద్‌ అలీ, అశ్వక్‌ అలీ, ఎల్బీనగర్‌లోని మెడిసిస్‌ ఆసుపత్రిలో పనిచేసే సునీల్‌ ‌మరో సేల్స్‌మెన్‌ ‌మజీద్‌ ‌వీరంతా ఇన్‌పేషెంట్‌గా ఉన్న కోవిడ్‌ ‌రోగుల వద్ద నుంచి ఇంజెక్షన్లు, మందులను దొంగిలిస్తున్నారు. కొట్టేసిన ఇంజెక్షన్లు, మందులను మెహదీపట్నంలోని ఓ మెడికల్‌ ‌దుకాణంలో అమ్మేవారు. మెడిసన్‌ ‌ఖరీదు రూ. 4,500 అయితే బ్లాక్‌లో రూ. 25 వేల నుండి రూ. 35 వేల వరకు విక్రయిస్తు సొమ్ముచేసుకుంటున్నారు.

ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టిన టాస్క్‌ఫోర్స్ ‌పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్‌ ‌పోలీసులకు అప్పగించారు. యాంటీ వైరల్‌ ‌డ్రగ్స్ ‌కేసులో కొత్త కోణం పేషెంట్లకు ఇవ్వాల్సిన డ్రగ్స్‌తో అక్రమ దందా..రెడు ప్రైవేట్‌ ‌హాస్పిటళ్ల సిబ్బంది అరెస్ట్ ‌హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న యాంటీ వైరల్‌ ‌డ్రగ్స్ ‌కేసులో కొత్త కోణం వెలుగు లోకి వచ్చింది. కొరోనా మొదలయిన నాటి నుండి గాంధీ హాస్పిటల్‌లోనే కొరోనా చికిత్స ఇస్తున్నారు. అయితే ఎప్పుడైతే ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లకి ఈ చికిత్స చేసే అనుమతి ఇచ్చారో ఆనాటి నుండి కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు ఈ దందా మొదలు పెట్టాయి. ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌లో కొరోనా చికిత్స తీసుకుంటున్న రోగుల మందులను అక్కడి సిబ్బంది మాయం చేస్తున్నారు. కొరోనా రోగులకు యాంటీ వైరల్‌ ‌డ్రగ్స్ ఇస్తున్నట్లుగా డ్రామాలు ఆడుతున్నట్టు తేలింది. ఆరు డోసుల డ్రగ్స్‌లో రెండింటిని వాడేసి మిగతా నాలుగు డోసులు సిబ్బంది కొట్టేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. అంతేకాక చనిపోయిన కరోనా రోగుల తాలూకా మందులను బహిరంగ మార్కెట్లో ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌ ‌సిబ్బంది అమ్మేసుకున్తున్నట్టు తేలింది. ఐదు వేల ఐదు వందలు రూపాయలు ఉన్న డ్రగ్స్‌ను 30 వేలకు ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌ ‌సిబ్బంది అమ్ముతున్నట్టు తేలింది. నగరంలో 6 ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లలోని సిబ్బంది ఈ చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు తేలింది. ఈ మేరకు మెహిదీపట్నంలోని ఒక ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌తో పాటు ఎల్బీనగర్‌లోని మరో ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌కి సంబందించిన సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హాస్పిటల్‌లోనే కరోనా రోగుల ఆంటీ వైరల్‌ ‌డ్రగ్స్ ‌ని సిబ్బంది మాయం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రోగులకు ఈ డోసుల లెక్క తెలియదు కాబట్టి వారికి ఇవ్వాల్సిన మందులను చోరీ చేసి సిబ్బంది అమ్ముకుంటున్నారు. బ్రోకర్స్ ‌తో పాటు రెండు ప్రైవేటు హాస్పిటళ్ల సిబ్బందిని అరెస్ట్ ‌చేసిన టాస్క్ ‌ఫోర్స్ ‌పోలీసులు ఆ ఎనిమిది మంది దగ్గర్నుంచి యాంటీ వైరల్‌ ‌డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply