Take a fresh look at your lifestyle.

కొరోనా వలన అనాథలైన పిల్లలకు..

  • కేవీల్లో ఉచిత విద్యనందించండి…
  • ప్రధాన మంత్రి మోడీకి కాంగ్రెస్ పార్టీ అభినేత్రి సోనియా గాంధీ లేఖ 
దేశ వ్యాప్తంగా కేవీలను ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి , న్యూ దిల్లీ ,మే 20:కొరోనా  తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు నవోదయ విద్యాలయాల్లో కేవీలలో ఉచిత విద్యను అందించాలని ప్రధాని మోడిని, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈ మేరకు గురువారం ఆమె ప్రధానికి లేఖ రాసారు. తల్లి దండ్రులను లేక కుటుంబంలో సంపాదించే పెద్ద దిక్కును కోల్పోయిన పిల్లలకు ఈ అవకాశం కల్పించాలని సూచించారు. తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ వ్యాప్తంగా కేవీలను ఏర్పాటు  చేశారని ఆమె లేఖ లో పేర్కొన్నారు.
కేంద్రీయ విద్యాలయాల ద్వారా హై క్వాలిటీ మోడరన్ ఎడ్యుకేషన్ ను గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభావంతులైన పిల్లలకు అందించాలని ఆయన కలలు కనేవారన్నారు.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న 661 నవోదయ స్కూల్స్ ద్వారా అనాథ పిల్లలకు విద్యనందించాలని కోరారు. వైరస్ మహమ్మారితో  అనూహ్యమైన విషాదం తర్వాత నష్టపోయిన పిల్లలకు బలమైన భవిష్యత్తు ఉందనే ఆశలు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై  ఉందన్నారు. ఇక, సోనియా లేఖను ట్యాగ్ చేస్తూ రాహూల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు చేసిన సూచనలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కోవిడ్ కారణంగా చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారన్నారు. ఇలాంటి వారికి కేవీల్లో ఫ్రీ ఎడ్యూకేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు

Leave a Reply