Take a fresh look at your lifestyle.

బీజేపీ, ఎంఐఎంలకు..సెప్టెంబర్‌ 17‌తో.. సంబంధమే లేదు

  • గాంధీభవన్‌లో విలీన దినోత్సవంలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌
  • ‌బిజెపి కార్యాలయంలో విమోచనోత్సవం
  • టిఆర్‌ఎస్‌ ‌భవన్‌లో విమోచనోత్సవం జెండా ఎగురేసిన మంత్రి కెటిఆర్‌

సెప్టెంబర్‌ 17‌తో బీజేపీ-ఎంఐఎంలకు సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. బీజేపీ మతపరమైన రాజకీయం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గురువారం గాంధీ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి. ఈ సందర్భంగా ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…సెప్టెంబర్‌ 17 ‌లో బీజేపీ-ఎంఐఎం పాత్ర ఏముందన్నారు. తెలంగాణ ఇచ్చింది, హైదరాబాద్‌ ‌సంస్థాన విలీనంతో నైనా కాంగ్రెస్‌ ‌కే సంబంధం ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబందే పెత్తనం ఉందని విమర్శించారు. దళితుణ్ణి సీఎం చేస్తా అని కేసీఆర్‌ ‌మాట మార్చారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌నాయకులు ఐక్యమత్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్‌ ‌శ్రేణులు సిద్ధమవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్సి జీవన్‌ ‌రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌ ‌రెడ్డి, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు. బిజెపి కార్యాలయంలో విమోచనోత్సవంబీజేపీ ఆఫీసులో తెలంగాణ విమోచన దినోత్సవం జరిగింది. జాతీయ జెండాను ఎగురవేసి అమరులకు నివాళి అర్పించారు. అధికారికంగా జరపాల్సిన వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఈ సందర్భంగా బీజేపీ నేత లక్ష్మణ్‌ అన్నారు. ఎంఐఎంకు భయపడే విమోచన దినాన్ని అధికారికంగా జరపడం లేదన్నారు. సెప్టెంబర్‌ 17‌ను అధికారికంగా జరపాలన్న బీజేపీ డిమాండ్‌ ‌వెనుక…ఎలాంటి రాజకీయ ఆలోచనలు లేవన్నారు. నిజాం నుంచి తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు కాబట్టే తెలంగాణ విమోచన దినాన్ని జరపాలని డిమాండ్‌ ‌చేస్తున్నామన్నారు. భారత్‌లో హైదరాబాద్‌ ‌విలీనం కాకుంటే ఒస్మానిస్తాన్‌గా మారేదని లక్ష్మణ్‌ ‌పేర్కొన్నారు.

Minister KTR hoisted the flag at the TRS office Telangana Bhavan on the occasion of Telangana Liberation Day
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని టిఆర్‌ఎస్‌ ‌కార్యాలయం తెలంగాణ భవన్‌లో జెండా ఎగురేసిన మంత్రి కేటిఆర్‌

టిఆర్‌ఎస్‌ ‌భవన్‌లో విమోచనోత్సవం జెండా ఎగురేసిన మంత్రి కెటిఆర్‌
‌భారతదేశంలో హైదరాబాద్‌ ‌రాష్ట్రం విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌.. ‌తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. గతంలో నాయిని నర్సింహారెడ్డి జెండా ఎగురేసేవారు. తాజాగా పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ •దాలో కెటీఆర్‌ ఈ ‌కార్యక్రమంలో పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply